Gold Rate Dropped: వామ్మో.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్న తీరు చూస్తుంటే సామాన్యులకు ఇది ఒక మంచి ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువ పెరగడం వంటి కారణాల వల్ల పసిడి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ముఖ్యంగా గత వారంతో పోలిస్తే తులం బంగారంపై గణనీయమైన మార్పు కనిపించడం, పెట్టుబడిదారులతో పాటు కొనుగోలుదారులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ క్షీణత కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశంగా మారింది.
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,020 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,800 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.5,950 తగ్గింది.
పసిడి ధరలు ఎందుకు తగ్గుతున్నాయంటే..?
ఈ ధరల తగ్గుదల వెనుక కొన్ని కీలక ఆర్థిక అంశాలు దాగి ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి తగ్గుముఖం పట్టడం మరియు అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాల ప్రభావం నేరుగా పసిడిపై పడింది. మన దేశీయ మార్కెట్‌లో కూడా దిగుమతి సుంకాలు, డిమాండ్‌లో వచ్చిన మార్పుల వల్ల ధరలు కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తే, మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి, బంగారం కొనాలనుకునే వారు ప్రస్తుత మార్కెట్ హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తూ సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,40,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,0200 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,28,500 వద్ద ఉంది.
Also Read: ఇంధన ఖర్చుల్లో ఆదా.. బెస్ట్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు, ఆఫర్లు ఇవే
నేటి సిల్వర్ ధరలు..
వావ్.. బంగారమే కాదండోయ్.. సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద ఉండగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,30,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 20,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.15,000 తగ్గి.. 2,30,000 వద్ద పలుకుతోంది.