E-Paper
Advertisement

Roja Controversy: రోజా ‘సెల్ఫ్ గోల్’.. జగన్ పరువు తీస్తున్న మాజీ మంత్రి వ్యాఖ్యలు!

Roja Controversy: రోజా ‘సెల్ఫ్ గోల్’.. జగన్ పరువు తీస్తున్న మాజీ మంత్రి వ్యాఖ్యలు!
Advertisement

Roja Controversy: మాజీ మంత్రి రోజా తనను మించి మాట్లాడేవారు రాష్ట రాజకీయాలలో ఎవ్వరు లేరునుకుంటారు.. ఏస్థాయిలో ఉన్న వ్యక్తి పై అయినా తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేస్తారు .. అలా శివాలెత్తిపోయే తరుణంలో ఆమె బాష కూడా మారిపోతుంటుంది. ఎంతటి వారినైనా ‘డు’ అంటూ ఏకవచనంలో చెలరేగిపోతారు.. అయితే తాము ప్రత్యర్థులను ఏస్థాయిలో నైనా విమర్శించ వచ్చుకాని, అదే వారు విమర్శిస్తే.. మాత్రమే కించపర్చారంటూ.. మీడియా ముందు కన్నీరు వలకబోస్తుంటారు. అలా తన కత్తికి రెండు వైపులా పదునుందునే రీతిలో వ్యవహరించే రోజా సెల్వమణి.. తాజాగా అమె సీఎం… డిప్యూటీ సీఎంలపై ధ్వజమెత్తారు. సతీసమేతంగా వారిద్దరు ఉగాది వేడుకలు జరుపుకోలేదని తెగ బాధపడిపోయారు. అయితే అదే ఆమెకు బూమరాంగ్ అయి.. సెల్ప్‌గోల్ చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఎదిగిన రోజా

మాజీ మంత్రి రోజారెడ్డి… అదేనండి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి తనకు తానే పొలిటికల్ పైర్ బ్రాండ్‌లా ఫీలైపోతూ .. నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. టీడీపీలో రాజకీయ శిక్షణ పొందిన ఆ మాజీ హీరోయిన్ .. అప్పట్లో చండప్రచండంగా స్వర్గీయ వైఎస్అర్‌ను చీల్చి చెండాడే ప్రయత్నం చేశారు .. టీడీపీలో ఉన్నప్పుడు 2004, 2009 ఎన్నికల్లో చంద్రగిరి, నగరిల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ.. ఆమెకు తన సినీ గ్లామర్ కాని, తమిళ మాజీ డైరెక్టర్ అయిన భర్త సెల్వమణి ఇమేజ్ కాని కలిసిరాక ఓటమి పాలయ్యారు. టీడీపీ కూడా అధికారంలో లేకపోవడంతో వైఎస్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 2014 ఎన్నికల నాటికి వైసీపీ పంచకు చేరిపోయారు.

వైసీపీ గాలిలో గెలిచిన రోజా

Advertisement

అప్పటికే ఐరన్ లెగ్ ట్యాగ్ లైన్ వచ్చిన రోజా.. వైసీపీ నుంచి 2014, 19 ఎన్నికల్లో ఆమె నగరి ఎమ్మెల్యేగా రెండు సార్లు వరుసగా ఎంతో కష్టపడి గెలవగలిగారు. మొదటి సారి 858 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యే అయిన రోజా.. 2019లో వైసీపీ గాలిలో కూడా 2,700 ఓట్లతో గట్టెక్కారు. జగన్ మంత్రి వర్గంలో రాష్టక్రీడా శాఖ, టూరిజం మంత్రిగా పనిచేసారు. గత ఎన్నికల్లో ఆమె సీన్ పూర్తిగా రివర్స్ అయింది. టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాష్ చేతిలో నగరి చరిత్రలోనే రికార్డు సృష్టిస్తూ.. ఏకంగా 47 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు.

మంత్రి కంటే మించిన మాటల దాడులు

కిందపడ్డా తనదే పైచేయి అన్నట్లు వ్యవహించే రోజా సెల్వమణి.. వైసీపీ హయాంలో మంత్రి కంటే అమె తన దూకుడు , తన విపరీత వ్యాఖలతో ఎప్పటికప్పుడు వివాదాల్తో చిక్కుకుంటూ ఫోకస్ అయ్యారు. ప్రత్యర్ధులను, రాజకీయాలకు దూరంగా ఉన్న వారి కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తూ.. వైసీపీ బూతు మంత్రుల లిస్టులోకి ఎక్కారు. .ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, పవన్ కుటుంబం,, అయన వివాహాలపై తీవ్రమైన కామెంట్స్ చేశేవారు. పవన్ ,లోకేష్ లపై వ్యక్తిగతంగా ఆమె చేసిన విమర్శలకు లెక్కేలేదు.

ఉగాది వేడుకలపై రోజా కామెంట్స్

Advertisement

నగరి వైసిపి శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించడంతో గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన రోజాని.. ప్రస్తుతం నగరి వైసీపీ ఇన్చార్జ్ గానే కొనసాగిస్తున్నారు ఆమె జననన్నా.. అని పిలుచుకునే మాజీ మఖ్యమంత్రి. అలాంటి జగన్ మెప్పు కోసమన్నట్లు ఉగాది సందర్భంగా ఆమె చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై నోరుపారేసుకుని రోజా తనతో పాటు, పార్టీని కూడా ఇరుకున పడేశారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. తిరుపతిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గోన్న రోజా సీఎం, డిప్యూటీ సీఎంలు కుటుంబంతో కలసి ఉగాది జరుపుకోలేదని విచిత్రమైన విమర్శలు గుప్పించారు.

రోజా మాటలపై సోషల్ మీడియాలో చర్చ

ఆమె నాయకుడు జగన్ మాత్రం భార్యతో కలసి సంప్రదాయ బద్దంగా ఉగాది జరుపుకున్నారంట. ఆ క్రమంలో సనాతన దర్మం…గాడిదలు అంటూ అధికార పక్ష పెద్దలపై ఇష్టారీతిన చెలరేగిపోయారు. పనిపనిగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని మరింత తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు.
ఉగాది నాడు సీఎం ఉగాది పంచాగ శ్రవణంతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో బీజీగా గడిపారు. దివ్వాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లతో కలిసి దివ్యాంగులతో కలిసి పల్లెవెలుగు బస్సులో ప్రయాణించి, వారి యోగక్షేమాలు కనుకున్నారు. సియం డిప్యూటీ సియం తో పాటు సియం,లోకేష్ లు పాల్గోన్నారు. ఆ సౌకర్యంగా దివ్యాంగులు బహిరంగంగానే హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని కొనియాడారు. అయితే అవేవీ కనిపించనట్లు రోజా సెల్వమణి .. సీఎం, డిప్యూటీ సీఎంలు సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గోనలేదని..సనాతన దర్మానికి, హిందు సంప్రదాయానికి తూట్లు పోడిచారని ఆగ్రహం వ్యక్తం చేసి నవ్వులపాలయ్యారు.

రోజా వ్యాఖ్యలు.. ట్రోలింగ్ పీక్ స్టేజ్

షరామామూలుగానే ఎప్పుడూ తొందరపాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రోజా ఉగాది రోజు నుంచి నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. మాజీ మంత్రి రోజా కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజాపై మండిపడటం అటుంచితే.. ఆమె కారణంగా మాజీ సీఎం జగన్ దంపతులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పీక్ స్టేజ్‌కి చేరింది. పర్వదినాలంటే వైసీపీ అధ్యక్షుడు తాడేపల్లి నివాసంలో సెట్టింగులు వేయించి, కానిచ్చేస్తుంటారు. సీఎంగా ఉన్నప్పుడు ఏకంగా తిరుమల సెట్టే వేయించుకున్నారు. అసలు సినిమా సెట్టింగులు వేయించుకుని భార్యతో కలసి ఉగాది వేడుకలు నిర్వహించడం కాదు..మీ నాయకుడు తన భార్యతో కలసి తిరుమలకో, లేకపోతే అక్కడే ఉన్న చిన్న ఆలయానికి రాగలరా? అని సవాళ్లు విసురుతున్నారు. పూజలంటే దేవుడి ముందు కూర్చుని చేస్తారని, అంతేకాని దేవుడి ఫొటోల ముందు కుర్చీల్లో కూర్చుని రాజసం వెలగబెట్టరని సెటైర్లు విసురుతున్నారు.

గాడిదను లేపి తన్నినట్లే

అదలా ఉంటే రోజా పవిత్రమైన పండుగ గురించి మాట్లాడుతూ, పెంట లాంటి పదాలను కూడా వాడారు. దాంతో జగన్‌ను ప్రత్యర్థుల ముందు మరింత బదనాం చేయడానికే ఆమె అలాంటి పదజాలం వాడుతూ, పార్టీని, జగన్‌ను ఇరుకున పెడుతున్నారని వైసీపీ శ్రేణులే చిందులు తొక్కుతున్నారంట.ఆమె వైఖరి తోడు నిద్ర పోతున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి పార్టీల మొదటి నుంచి ఓపద్దతి ప్రకారం జగన్ అండ్ కో పై చేస్తున్న విమర్శలతో వైసీపీ డిఫెన్స్ పడిందనే చర్చ నడుస్తోంది. దీని నుంచి బయటపడ్డానికి జగన్ అండ్ టీమ్ అష్ట కష్టాలు పడుతూ, ముఖ్యంగా టీటీడీని టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లాడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. అయితే మధ్యలో రోజా లాంటి వారు వచ్చి ఈ విదంగా మాట్లాడుతూ ఇన్ని రోజులు పడిన కష్టాన్ని వృథా చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారంట.

ఉగాది వేడుకలపై సోషల్ మీడియా ట్రోలింగ్

చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు ఈ మద్యకాలంలో వ్యవహారిస్తున్న తీరు హిందు వాదానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు మాట. ఇదే సమయంలో ఇతర మతాల పట్ల కూడా చాలా జాగ్రతగా వ్యవహారిస్తున్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..రోజా చేసిన వ్యాఖలతో పాటు అమె వాడిన భాష పై ఆ పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంట. జగన్ నిర్వహించిన ఉగాది వేడుకలపై కూడా సోషియల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుండటంతో.. కారణం రోజా చేసిన కామెంట్సే అని వైసీపీ వర్గాలు గుర్రుగా ఉన్నాయంట…అయిన రోజా మాత్రం తాను మాత్రం తగ్గేది లేదని అంటున్నారట. పాజిటివ్ అర్ నెగిటివ్ ఎదో ఒక విధంగా జనం నోళ్లలో నానుతూనే ఉండాలనట్లు ఆమె వ్యవహరిస్తున్న తీరుతో.. విసిగివేసారి పోతున్నాయంట వైసీపీ శ్రేణులు. అంతేలేండి సినిమా ఛాన్సులు లేవు, టీవీ షోల్లో పక్కన పెట్టేశారు, పొలిటికల్‌గా ఎలాంటి ఉపాధి లేదు… ఎవరి బాధలు వారివి.

Also Read: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×