E-Paper
Advertisement

Ranya Rao: 100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్.. ఈమె అతి తెలివి చూస్తే షాక్!

Ranya Rao: 100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్.. ఈమె అతి తెలివి చూస్తే షాక్!
Advertisement

Ranya Rao: ప్రముఖ కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో విస్తుపోయే వార్త వెలుగులోకి వస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలనే అత్యాశతో సాగిన ఈ స్మగ్లింగ్ దందా ఇప్పుడు దేశాలు దాటి ఈమె ఖాతాలో వందల కోట్లు చేర్చింది. ముఖ్యంగా ఆఫ్రికా గనుల నుంచి దుబాయ్ మీదుగా భారత్ కి ఎలా విస్తరించిందో ఈడీ దర్యాప్తులో బట్టబయలు అయింది. ఒక ఏడాది వ్యవధిలోనే సుమారుగా 102 కోట్ల విలువైన అంటే 127 కిలోల బంగారాన్ని దేశంలోకి ఈమె అక్రమంగా తీసుకొచ్చినట్లు ఈడి అధికారులు తాజాగా బెంగళూరులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో పొందుపరిచారు. ఈ కేసులో రన్యారావు తో పాటు ఆమె అనుచరుడు తరుణ్ కొండూరు, బళ్లారికి చెందిన గోల్డ్ డీలర్ సాహిల్ సకారియా జైన్ పేర్లను కూడా ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చింది.

రన్యారావ్ గోల్డ్ స్మగ్లింగ్ లో విస్తుపోయే నిజాలు..

ఇకపోతే దుబాయ్ మార్కెట్ కి వచ్చే బంగారంలో ఎక్కువ మొత్తం ఆఫ్రికా గనుల నుంచే వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రన్యా రావు, తరుణ్ కొండూరు నేరుగా అక్కడి నుంచే తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయాలనే పథకం పన్నారు. ఇందుకోసం దుబాయ్ లో “వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ” పేరుతో ఒక సంస్థను స్థాపించి కెన్యా, ఉగాండా, టాంజానియాల్లో ఏజెంట్ల కోసం గాలింపు కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉగాండాకు చెందిన బెన్ అనే ఏజెంట్ తో ఒప్పందం కుదుర్చుకున్న వీరు మొదట ట్రయల్ రన్ గా 5 కిలోలు, అది విజయవంతమైతే 50 కిలోల బంగారాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేశారు.

రెండు కోట్ల వరకు భారీ మోసం..

Advertisement

అందులో భాగంగానే అడ్వాన్స్గా 25 వేల డాలర్లతో పాటు పన్నులు తదితర ఖర్చుల కోసం రెండు దఫాలుగా రూ.9.4లక్షల చొప్పున బెన్ కి చెల్లించారు. ఎన్ని రోజులకి బంగారం రాకపోవడంతో 2024 జనవరిలో తరుణ్ కొండూరు స్వయంగా ఉగాండా రాజధాని కంపాలా వెళ్లాడు. అక్కడ అతనికి ఒక రిఫైనరీలో బంగారాన్ని చూపించి.. దానిని వదిలించుకోవడానికి మరో 1.7 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత మోసపోయామని ఈ జంట గ్రహించలేకపోయింది. నెమ్మదిగా అసలు విషయం తెలుసుకున్నారు. ఈ ఉదంతంతో వీరు సుమారుగా రెండు కోట్ల వరకు నష్టపోయారు. అలా ఆఫ్రికాలో ఎదురుదెబ్బ తగలడంతో రన్యా, తరుణ్ తమ రూట్ మార్చుకొని ఆఫ్రికన్ డీలర్ల నుంచి దుబాయ్ లోని డేరా గోల్డ్ సౌక్ లో నేరుగా నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇక దీనికోసం భారీగా నగదును మార్కెట్ కి తీసుకెళ్లేది రన్యా. దుబాయ్ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్ లేదా థాయిలాండ్ వంటి మూడో దేశానికి రవాణా చేస్తున్నట్లు తరుణ్ కొండూరి నకిలీ కష్టం డిక్లరేషన్లను సృష్టించేవాడు.

ALSO READ:Dhurandhar : ధురంధర్ లో యలీనా.. ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటకి!

తండ్రి హోదాను వాడుకొని భారీ స్మగ్లింగ్..

Advertisement

కానీ వాస్తవానికి ఈ బంగారాన్ని దుబాయ్ ఎయిర్పోర్ట్లో రన్యారావు తీసుకొని తన దుస్తుల్లో దాచుకొని భారత్ కి స్మగ్లింగ్ చేసేది. పైగా రన్యారావ్ సవతి తండ్రి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆ హోదాని వాడుకొని ఆమె బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో విఐపి ప్రోటోకాల్స్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసింది .కానీ ఆమె తరచూ దుబాయ్ కి వెళ్లి వస్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె లగేజ్ను పరిశీలించగా అప్పుడు ఈ విషయం బయటపడింది. ఏది ఏమైనా రన్యారావ్ అతి తెలివి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచినా.. ఆమెను రోజురోజుకీ ఊబిలోకి దింపేస్తోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×