Emergency fund importance: ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో ప్రతి ఒక్కరి జీవితం బిజీ బిజీగా సాగిపోతోంది. చేతిలో మంచి ఉద్యోగం, నెల వారీ జీతం ఉన్నప్పుడు భవిష్యత్తు గురించిన ఆందోళన పెద్దగా ఉండదు. కానీ.. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోవడం,ఆరోగ్య సమస్యలు రావడం లేదా కుటుంబంలో ఇతర అత్యవసర ఖర్చులు తలెత్తడం వంటివి జరిగినప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఒక్క సారిగా తలకిందులవుతుంది. ఇలాంటి సమయంలో.. మనల్ని కాపాడే ఒకే ఒక కవచం ‘ఎమర్జెన్సీ ఫండ్’. సాధారణంగా మీ నెల వారీ ఖర్చులకు కనీసం 6 నుంచి 8 నెలల మొత్తాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. దీని వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం!
కంపెనీలలో లేఆఫ్స్ లేదా ఆర్థిక సమస్యల కారణంగా.. ఎవరి ఉద్యోగమైనా హఠాత్తుగా పోయే .. అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కొత్త జాబ్ వెతుక్కునేందుకు కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. మీ దగ్గర 6 నుంచి 8 నెలల ఖర్చులకు సరి పడా సేవింగ్స్ ఉంటే.. జాబ్ లేకపోయినా ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు.
ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయో.. ఎవరూ చెప్పలేం. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు అదనపు ఖర్చులు, మెడిసిన్స్ కోసం డబ్బు అవసరం అవుతుంది. అలాగే.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే వరకు నగదు రూపంలో డబ్బు ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం వల్ల ఎవరి ముందూ చేయి చాచకుండా.. ఎక్కువ వడ్డీలకు అప్పులు చేయకుండా హాస్పిటల్ బిల్లులను ఈజీగా చెల్లించవచ్చు.
3. మానసిక ప్రశాంతత:
డబ్బు లేకపోవడం వల్ల.. కలిగే మానసిక ఒత్తిడి మనిషిని శారీరకంగా కూడా కుంగదీస్తుంది. “రేపు ఉదయం ఏంటి పరిస్థితి?” అనే భయం లేకుండా..బ్యాంకు అకౌంట్‌లో మనకు సేఫ్టీనిచ్చే సేవింగ్స్ ఉన్నాయనే.. ధైర్యం ఉంటే ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.డబ్బు మెంటల్ పీస్ అనేది అత్యంత విలువైనది.
మనం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతుంటాం. కానీ, డబ్బు అవసరమైతే ఆ పెట్టుబడులను మధ్యలోనే నష్టానికి తీసుకోవాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే.. ఆ పొదుపు డబ్బును అత్యవసరాలకు వాడొచ్చు. దీని వల్ల మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను వాడాల్సిన అవసరం ఉండదు.
అత్యవసర సమయంలో డబ్బు లేక .. క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువ వడ్డీకి క్యాష్ విత్‌డ్రా చేయడం లేదా పర్సనల్ లోన్లు తీసుకోవడం వల్ల అప్పుల చక్రంలో చిక్కుకుపోతాము. ఎమర్జెన్సీ ఫండ్ మిమ్మల్ని ఈ డెట్ ట్రాప్ నుంచి పూర్తిగా రక్షిస్తుంది.
Also Read: క్రెడిట్ కార్డ్ మాన్యువల్ ఫీజుకు బై-బై..లైఫ్‌టైమ్ ఫ్రీగా వాడుకునేందుకు మార్గాలు!
ఆరు నుంచి ఎనిమిది నెలల ఖర్చులను పక్కన పెట్టడం అంటే.. మీ నెల వారీ ఖర్చులు రూ.30,000 అనుకుంటే.. సుమారు రూ. 1,80,000 నుంచి రూ.2,40,000 వరకు అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. ఈ మొత్తాన్ని ఈజీగా ఉపసంహరించుకునేందుకు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ , హై-ఈల్డ్ సేవింగ్స్ అకౌంట్లు.. లేదా తక్కువ కాలం చేసే ఫిక్స్డ్ డిపాజిట్లలో దాచుకోవడం బెస్ట్. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి అదనపు ఖర్చులు ఉండవు, పైగా కొంత వడ్డీ కూడా వస్తుంది.
రేపటి అనూహ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు.. ఈరోజు చేసే చిన్న పొదుపే భవిష్యత్తులో.. మనల్ని రక్షిస్తుంది. విలాసాల కోసం ఖర్చు చేసే ముందు, ఆరు నుంచి ఎనిమిది నెలల ఖర్చులకు సరి పడా ఎమర్జెన్సీ ఫండ్‌ను పక్కన పెట్టుకోవడం ద్వారా నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందొచ్చు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా జీవించండి!