E-Paper
Advertisement

క్రెడిట్ కార్డ్ మాన్యువల్ ఫీజుకు బై-బై..లైఫ్‌టైమ్ ఫ్రీగా వాడుకునేందుకు మార్గాలు!

క్రెడిట్ కార్డ్ మాన్యువల్ ఫీజుకు బై-బై..లైఫ్‌టైమ్ ఫ్రీగా వాడుకునేందుకు మార్గాలు!
Advertisement

Lifetime free credit card tips:  ప్రస్తుత కాలంలో .. క్రెడిట్ కార్డు వాడకం అనేది ముఖ్యంగా మారిపోయింది. ఆన్‌లైన్ షాపింగ్, ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, రెస్టారెంట్ బిల్స్ వంటి ప్రతి దానికీ క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే..కార్డులు వాడేటప్పుడు చాలా మంది ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే.. ప్రతి సంవత్సరం పడే యాన్యువల్ ఫీజు లేదా.. రెన్యువల్ చార్జీలు! ఎలాంటి ఉపయోగం లేకపోయినా.. ప్రతీ ఏటా వందల నుంచి వేల రూపాయలు ఫీజు రూపంలో కట్ అవుతుంటే.. ఎవరికైనా చిరాకు వస్తుంది. మరి.. ఈ ఫీజు పూర్తిగా వదిలించుకుని మీ క్రెడిట్ కార్డును జీవితకాలం ఉచితంగా మార్చుకోవడం ఎలా? ఇప్పుడు కొన్ని అద్భుతమైన మార్గాలను చూద్దాం!

పూర్తి ఫీచర్లు:

1. బ్యాంక్ కస్టమర్ కేర్‌:

మీ క్రెడిట్ కార్డ్ మాన్యువల్ ఫీజు పడే.. సమయం దగ్గర పడినప్పుడు లేదా ఫీజు పడిన వెంటనే..మీ బ్యాంక్ కస్టమర్ కేర్ లేదా రిటెన్షన్ టీమ్‌కు కాల్ చేయండి. మీరు ఆ బ్యాంకుకు చాలా కాలంగా నమ్మకమైన కస్టమర్ అని.. ప్రతి నెలా క్రమం తప్ప కుండా బిల్లులు చెల్లిస్తున్నారని.. వారికి వివరించండి. ఒక వేళ ఫీజు రద్దు చేయక పోతే.. కార్డును క్లోజ్ చేయాల్సి వస్తుందని చెప్పండి. చాలా సందర్భాల్లో బ్యాంకులు తమ కస్టమర్‌ను కోల్పోవడం ఇష్టం లేక ఆ సంవత్సరపు ఫీజును పూర్తిగా మాఫీ చేస్తాయి లేదా తర్వాత ఖర్చులపై క్యాష్‌ బ్యాక్ ఇస్తాయి.

2. స్పేండింగ్ టార్గెట్ :

Advertisement

చాలా బ్యాంకులు కొన్ని నిబంధనలతో కూడిన ఆఫర్‌ను అందిస్తుంటాయి. ఉదాహరణకు.. ఒక సంవత్సరంలో మీరు రూ. 50,000 నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తే ఆటోమేటిగ్గా నెక్స్ట్ ఇయర్ యాన్యువల్ ఫీజు మాఫీ అవుతుంది. మీరు మీ రోజు వారి ఖర్చులను అదే క్రెడిట్ కార్డు ద్వారా చేయడం ద్వారా ఈ మైలురాయిని ఈజీగా చేరుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి ఎక్ట్రా ఫీజు పడదు.

3. రివార్డ్ పాయింట్ల ద్వారా ఫీజు:

మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించిన.. ప్రతిసారీ మీకు కొన్ని రివార్డ్ పాయింట్లు వస్తుంటాయి. చాలా మంది ఈ పాయింట్లు.. ఏలా వాడాలో తెలియక వదిలేస్తుంటారు. బ్యాంకులు అందించే.. యాన్యువల్ ఫీజును ఈ రివార్డ్ పాయింట్ల ద్వారా రీడీమ్ చేసుకునే వెసులు బాటు చాలా కార్డుల్లో ఉంటుంది. మీ అకౌంట్‌లో తగినన్ని పాయింట్లు ఉంటే.. కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఆ పాయింట్ల ద్వారానే ఇయర్ ఫీజు సెటిల్ చేయమని కోరవచ్చు.

4. లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డుల అప్‌గ్రేడ్:

Advertisement

మీరు ఉపయోగిస్తున్న.. ప్రస్తుత క్రెడిట్ కార్డుపై భారీగా ఫీజు పడుతుంటే.. బ్యాంకును సంప్రదించి మీ కార్డును లైఫ్‌టైమ్ ఫ్రీ వేరియంట్‌కు అప్‌గ్రేడ్ చేయమని అడగొచ్చు. బ్యాంకులు తరచూ కొత్త, మెరుగైన లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డులను ప్రవేశ పెడుతుంటాయి. మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటే బ్యాంకులు ఎలాంటి ఫీజు లేకుండానే మరో మంచి కార్డుకు అప్‌గ్రేడ్ చేయడానికి అంగీకరిస్తాయి.

5. సాలరీ అకౌంట్:

మీకు ఏ బ్యాంకులో అయితే సాలరీ అకౌంట్ ఉందో.. అదే బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డును తీసుకుంటే.. లైఫ్‌టైమ్ ఫ్రీగా పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులు తమ ప్రీమియం కస్టమర్లకు, సాలరీ అకౌంట్ హోల్డర్లకు స్పెషల్ ఆఫర్లుగా జీరో యాన్యువల్ ఫీజు కార్డులను అందిస్తుంటాయి. క్రెడిట్ కార్డు తీసుకునే.. ముందే ఈ విషయాలు పరిశీలించడం మంచిది.

Also Read: మతిపోయే ఫీచర్లతో బెస్ట్ ఇయర్‌బడ్స్,ఫుల్ డీటెయిల్స్ ఇవిగో! 

6.ఖర్చులు, ఆర్థిక ప్రయోజనాలు:

సాధారణ క్రెడిట్ కార్డుల ఇయర్ ఫీజులు మార్కెట్లో రకం బట్టి సుమారు రూ.500 నుంచి రూ.3,000 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. మనం కొంచెం తెలివిగా.. వ్యవహరించి పైన చెప్పిన ట్రిక్స్ పాటిస్తే.. ఈ అనవసరపు ఖర్చును పూర్తిగా జీరో చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డు అనేది మన ఆర్థిక అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సాధనం. కానీ అది మనకు భారంగా మారకూడదు. కొద్దిపాటి అవగాహన, సరైన సమయంలో బ్యాంక్‌తో మాట్లాడటం ద్వారా మీ క్రెడిట్ కార్డును ఈజీగా జీవిత కాలం ఉచితంగా మార్చుకోవచ్చు. అప్రమత్తంగా ఉంటూ మీ కష్టపడి సంపాదించిన ప్రతీ రూపాయినీ కాపాడుకోండి.

Related News

రేపటి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి..ఎమర్జెన్సీ సేవింగ్స్ వల్ల కలిగే సూపర్ బెనిఫిట్స్!

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు..ఈ 6 తప్పులు అస్సలు చేయెద్దు!

నామినీ చనిపోతే డబ్బు ఎవరికి చెందుతుంది? బ్యాంకుల కొత్త రూల్స్!

బంగారం ధరలు మరింత కిందకి? ఇప్పుడు కొనాలా? వద్దా?

ఒక మనిషికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి? నిపుణులు ఏమంటున్నారు?

పండగ వేళ మహిళలకు శుభవార్త.. భారీ పడుతున్న బంగారం-వెండి ధరలు

ఉద్యోగంతో విసిగిపోయారా? రూ. లక్ష ఉంటే చాలు.. ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారాలు ఇవే!

Big Stories

Advertisement
×