E-Paper
Advertisement

7.5 శాతం వడ్డీ… అదిరిపోయే ఈ పోస్ట్ ఆఫీసు స్కీమ్ గురించి తెలుసా ?

7.5 శాతం వడ్డీ… అదిరిపోయే ఈ పోస్ట్ ఆఫీసు స్కీమ్ గురించి తెలుసా ?
Advertisement

Post Office FD Scheme : కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో భాగంగానే చాలామంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలాంటి డిజిటల్ యుగంలో కూడా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది జనాలు పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు జమ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. దానికి కారణం పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో జమ చేస్తే డబ్బు ఎక్కడికి పోదు అనే గట్టి నమ్మకం. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ నేరుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కారణంతోనే అక్కడ జమ చేసే డబ్బు ప్రతి పైసా సురక్షితంగా ఉండడమే కాకుండా స్థిరమైన భరోసాతో కూడిన రాబడి లభిస్తుంది. ఇక ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ లో సామాన్యులకు ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే 2 లక్షలు జమ చేస్తే 90,000 స్థిర వడ్డీని సంపాదించవచ్చు అనే విషయం తెలుసా?

ఎఫ్డిలపై 7.5% వడ్డీ

బ్యాంకుల మాదిరిగానే పోస్ట్ ఆఫీసులు కూడా తమ వినియోగదారుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నాయి. వీటిని ఒక సంవత్సరం నుంచి మొదలు పెడితే ఐదు సంవత్సరాల కాల పరిమితితో ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఎఫ్డి ఖాతాలను టీడీ అంటే టైం డిపాజిట్ అనే పేరుతో ఓపెన్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ వినియోగదారులు ఒక సంవత్సరం ఎఫ్డిలపై 6.9 శాతం, రెండు సంవత్సరాలు ఎఫ్డిలపై 7.0 శాతం, 3 సంవత్సరాలకు 7.1%, 5 సంవత్సరాల ఎఫ్డిలపై 7.5% వడ్డీని పొందుతారు. అన్ని వయసులవారు తమ ఎఫ్డి ఖాతాలపై సమాన వడ్డీని పొందడం విశేషం. సాధారణంగా బ్యాంకులలో సీనియర్ సిటిజెన్లు అధిక వడ్డీని పొందుతారు. అయితే పోస్ట్ ఆఫీస్ లో ఐదు సంవత్సరాల ఎఫ్డి పథకంలో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరికీ మంచి వడ్డీ లభిస్తుంది.

Advertisement

Also Read : రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ప్లాన్… ఓటీటీలోకి కొత్త సిరీస్

2 లక్షలు పెడితే 90,000

ఇక 60 నెలల పాటు 2,00,022 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మొత్తం 2,90,000 వస్తుంది. ఇందులో 90,000 స్థిర వడ్డీ కూడా ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని ఏ బ్యాంకు కూడా సాధారణ జనాలకు 5 సంవత్సరాలలో ఎఫ్డి పథకంపై 7.5% వడ్డీని అందించకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ పథకంలో కనీసం డిపాజిట్ 1000 రూపాయలుగా ఉంటే, గరిష్ట డిపాజిట్ ఎంత అన్న దానిపై పరిమితి లేదు. ఇక్కడ ఎంత కావాలంటే అంత డిపాజిట్ చేసుకొనే అవకాశం ఉంది.

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×