E-Paper
Advertisement

రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ప్లాన్… ఓటీటీలోకి కొత్త సిరీస్

రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ప్లాన్… ఓటీటీలోకి కొత్త సిరీస్
Advertisement

The Pyramid Scheme OTT : సీమ్స్ పేరుతో ఎన్నో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ వంటి భారీ మోసాల వల్ల అమాయకులు బలి అవుతారు. అయితే ఇలాంటి ఫినాన్షియల్ స్కామ్స్ ఆధారంగా తెరకెక్కే సిరీస్ లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పటిదాకా ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సిరీస్ లు, సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు ఇదే జానర్లో రూపొందిన మరో కొత్త సిరీస్ తెరపైకి రాబోతోంది. తాజాగా దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఫినాన్షియల్ స్కామ్ డ్రామాగా రూపుదిద్దుకున్న హిందీ డ్రామా సిరీస్ The Pyramid Scheme. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో విడుదల కానున్న ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ ను ‘పంచాయత్’, ‘ఆస్పిరెంట్స్’ వంటి సూపర్ హిట్ షోలను అందించిన ది వైరల్ ఫీవర్ (TVF) సంస్థ నిర్మించడం విశేషం. 2026 జూన్ 5 నుండి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుందని తాజాగా అఫిషియల్ గా అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్ లో షార్ట్‌కట్ పద్ధతుల్లో ధనవంతులు కావాలనుకునే వారి ప్లాన్, దాని వెనుక ఉండే అసలు రంగులను, వాటి వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతాయి అనే విషయాలను ఆసక్తికరంగా చూపించారు.

Advertisement

శ్రేయాంశ్ పాండే క్రియేట్ చేసిన ఈ సిరీస్‌లో పరంవీర్ సింగ్, రణ్‌వీర్ షోరే, శేఖర్ సుమన్, అంజన్ శ్రీవాస్తవ్, అఖిలేంద్ర మిశ్రా, స్మితా బన్సాల్, సుశాంత్ సింగ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కన్పిస్తారు. దీనికి ఆశిష్ ఆర్. శుక్లా – శ్రేయాంశ్ పాండే సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అక్షేంద్ర మిశ్రా అందించిన స్క్రీన్‌ప్లే భావోద్వేగాలను, ఆర్థిక నేరాల వెనుక ఉండే గందరగోళాన్ని సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించడం మరో విశేషం.

కథలోకి వెళ్తే..

హరిద్వార్ నేపథ్యంలో స్టోరీ నడుస్తుంది. గోల్డీ (పరంవీర్ సింగ్ చీమా) అనే ఒక తెలివైన యువకుడు ఎలాగైనా జీవితంలో స్థిరపడాలి అనుకుంటాడు. అంతేకాదు బాగా రిచ్ కావాలని ఆరాట పడుతుంటాడు. ఈ క్రమంలో ఈజీగా మనీ సంపాదించవచ్చనే ఆలోచనతో ‘పిరమిడ్ మార్కెటింగ్’ (మల్టీ-లెవెల్ మార్కెటింగ్) వ్యాపారం వైపు అట్రాక్ట్ అవుతాడు. కేవలం డబ్బు కోసమే అతను తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబంతో పాటు అతని జీవితాన్ని, ప్రపంచాన్ని ఎలా తలకిందులు చేసిందనేది ఈ సిరీస్ ప్రధానాంశం.

Advertisement

Also Read : పోచమ్మ విగ్రహాన్ని పొరపాటున పారేసే క్రిష్టియన్… కట్ చేస్తే కాటేరమ్మ జాతర

గోల్డీ బిజినెస్ లో నిజాయితీగా ఉండే మనోజ్ శ్రీవాస్తవ (రణ్‌వీర్ షోరే) అనే వ్యక్తి కూడా జాయిన్ అవుతాడు. మొదట్లో మంచి ఆశయాలతోనే స్టార్ట్ అయిన ఈ బిజినెస్.. నెమ్మదిగా నమ్మక ద్రోహంగా మారుతుంది. ఆ క్రూరమైన వ్యాపార సామ్రాజ్యంలో ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఎలా దిగజారుతారో ఈ సిరీస్‌లో గ్రిప్పింగ్‌గా చూపించడం విశేషం.

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×