E-Paper
Advertisement

Section 80C Investment: పన్ను ఆదా కోసం సెక్షన్ 80Cలో పెట్టుబడులు.. ఎమర్జెన్సీలో విత్ డ్రా చేసుకోవచ్చా?

Section 80C Investment: పన్ను ఆదా కోసం సెక్షన్ 80Cలో పెట్టుబడులు.. ఎమర్జెన్సీలో విత్ డ్రా చేసుకోవచ్చా?
Advertisement

Section 80C Investment: పాత పన్ను విధానంలో.. సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఇందుకోసం చాలా మంది తాత్కాలికంగా పెట్టుబడులు పెడుతుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజు ఖర్చులతో పాటు.. తాత్కాలికంగా కొంత అమౌంట్ ను ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే మీకు అర్జెంట్ గా డబ్బు అవసరం అయితే.. గతంలో ఇన్వెస్ట్ చేసి పెట్టుబడులను విత్ డ్రా చేసుకోవచ్చో? లేదో తెలుసుకోవచ్చు.

పీపీఎఫ్ అకౌంట్ పెట్టుబడులు

సెక్షన్ 80C పన్ను మినహాయింపు పొందాలంటే.. మీ సొంత పీపీఎఫ్ అకౌంట్ లో లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లల అకౌంట్ లో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. PPF అకౌంట్ కు 15 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. 15 సంవత్సరాలు పూర్తైన తర్వాత ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత మాత్రమే మెచ్యూరిటీ అమౌంట్ ను పొందుతారు. PPF అకౌంట్ ఓపెన్ చేసి ఏడాది లేదా ఐదు సంవత్సరాలు పూర్తవ్వడానికి ముందుగా మీ అకౌంట్ పై లోన్ తీసుకోవచ్చు.

Advertisement

అయితే లోన్ మొత్తం.. లోన్ అప్లై చేసిన ఏడాది నుంచి రెండేళ్ల క్రితం ఆ ఖాతా బ్యాలెన్స్‌లో 25 శాతానికి పరిమితం అవ్వాలి. కాబట్టి మూడో ఏడాది చివరిలో మీ ఖాతా బ్యాలెన్స్‌లో 25% రుణం తీసుకోవచ్చు. ఐదేళ్లు పూర్తయితే PPF ఖాతా నుంచి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే ఫోర్త్ ఇయర్ ఎండ్ లో ఉన్న బ్యాలెన్స్‌లో 50% లేదా విత్ డ్రా ఇయర్ కు మునుపటి ఏడాది చివరిలో ఉన్న బ్యాలెన్స్‌కు విత్ డ్రా పరిమితం అవుతుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC) పెట్టుబడులకు సెక్షన్ 80C వర్తిస్తుంది. ఈ పెట్టుబడులను మెచ్యూరిటీకి ముందుగానే డబ్బులు పొందవచ్చు. NSCకి ఐదు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. సాధారణంగా NSC నుంచి డబ్బు విత్ డ్రాకు అవకాశం లేదు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే బ్యాంకు లేదా NBFC నుంచి NSCపై లోన్ తీసుకోవచ్చు. బ్యాంకులు NSC ఫేస్ వ్యాల్యూలో 70% నుంచి 80% వరకు లోన్ ఇస్తాయి. వడ్డీ రేటు బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. SBI ప్రస్తుతం NSCపై 11.20% వద్ద వడ్డీ ఛార్జ్ చేస్తుంది.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌

Advertisement

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌(ELSS)లలో పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మూడేళ్లు ముగిసిన తర్వాత మీ పెట్టుబడిని ఎప్పుడైనా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే రిడెంప్షన్ సమయం కచ్చితంగా మార్కెట్ పరిస్థితులపై బేస్ అయి ఉంటుంది. మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ELSS పెట్టుబడులపై మంచి రాబడి రాకపోతే, సెక్షన్ 80C కింద మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అదే పెట్టుబడిని ఉపయోగించవచ్చు. అంటే ఇప్పటికే ఉన్న పెట్టుబడులను రీడీమ్ చేసి, మళ్లీ అదే రోజున పెట్టుబడి పెడితే పన్ను ప్రయోజనాలకు అర్హులు అవుతారు. ఈ పెట్టుబడుల NAV ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇస్తాయి.

Also Read:  మీ పిల్లల భవిష్యత్ కోసం 3 బెస్ట్ పెట్టుబడి పథకాలు

లైఫ్ ఇన్సూరెన్స్

సెక్షన్ 80C పన్ను మినహాయింపు కోసం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. కొంత కాలం తర్వాత వాటిపై రుణం తీసుకోవచ్చు. బీమా పాలసీలపై సాధారణంగా ఐదేళ్లు గడిచిన తర్వాత లోన్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అయితే టర్మ్ ప్లాన్ పై లోన్ తీసుకునే అవకాశం ఉండదు.

 

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×