Bhupalpally Crime: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెుగుళ్లపల్లి మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొరికిశాల గ్రామంలో వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బావి లోపల మట్టిన తొలగిస్తున్న క్రమంలో.. మట్టిని పైకి లాగుతున్న క్రేన్ ఒక్కసారిగా తెగిపడటంతో ఈ దారుణం జరిగింది.
ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకర పరిస్థితి విషమంగా ఉంది. క్షతగ్రాతుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే గ్రామస్తులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. మృతులు కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవారావు (48), బండారి అభిలాష్(16), పిడిసిల్ల గ్రామానికి చెందిన సరిగొమ్ముల పైడి(53) గా గుర్తించారు . సుకిన్ మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకే గ్రామానికి చెందిని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: మద్యం మత్తులో ట్రక్ డ్రైవర్.. బైక్‌పై వస్తున్న యువకులను ఢీ కొట్టి..