E-Paper
Advertisement

Senior Citizens Savings Scheme: సీనియర్ సిటిజన్లకు సూపర్ స్కీమ్.. పన్ను ప్రయోజనాలు, నెలకు రూ.20 వేల రిటర్న్స్!

Senior Citizens Savings Scheme: సీనియర్ సిటిజన్లకు సూపర్ స్కీమ్.. పన్ను ప్రయోజనాలు, నెలకు రూ.20 వేల రిటర్న్స్!
Advertisement

Senior Citizens Savings Scheme: సీనియర్ సిటిజన్లకు పదవీ విరమణ తర్వాత సాధారణంగా ఎటువంటి ఆదాయం ఉండదు. సీనియర్ సిటిజన్లు ఆర్థిక ఇబ్బంది పడుకుండా ఉండేదుకు కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(SCSS) ప్రారంభించింది. ఈ సేవింగ్స్ స్కీమ్ లో సీనియర్ సిటిజన్లు తమ డబ్బును పెట్టుబడి పెడితే కాలక్రమేణా వడ్డీ పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ స్కీమ్ లో కొన్ని పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే పూర్తిగా పన్ను రహితం కాదు. కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటిలో ఈ స్కీమ్ కే అధిక వడ్డీ అందిస్తుంది. SCSS స్కీమ్ ద్వారా మీరు నెలకు రూ.20,000 కంటే ఎక్కువ రాబడి ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏమిటి?

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్.. సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకుండా భద్రత కల్పించేందుకు అమలు చేస్తున్న పొదుపు పథకం. 60 ఏళ్లు పైబడిన వారికి సురక్షితమైన పెట్టుబడి మార్గాన్ని అందిస్తుంది. డిఫెన్స్ లో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారులు అయితే 50 ఏళ్లకే SCSS ఖాతాను తెరవవచ్చు. మీరు, మీ జీవిత భాగస్వామితో కలిసి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాకు ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ టైమ్ ముగిసిన తర్వాత డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా మరో మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?

Advertisement

ఈ పథకంలో కనీసంగా ఏడాదికి రూ.1,000, గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టువచ్చు. అధిక మొత్తంలో పెట్టుబడికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుత వడ్డీ రేటు 8.2%. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, ద్రవ్యోల్బణ రేటును బట్టి వడ్డీ రేట్లు సవరిస్తుంటారు.

నెలకు రూ.20,000 ఎలా సంపాదించాలి?

SCSSతో ప్రతి నెలా రూ. 20,000 కంటే ఎక్కువ సంపాదించవచ్చు. మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసులో SCSS ఖాతాను ఓపెన్ చేసి రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి. వార్షిక వడ్డీ రేటు 8.2% చొప్పున లెక్కగడితే.. మీకు ఏడాదికి దాదాపు రూ.2.46 లక్షలు వడ్డీ రూపంలో వస్తుంది. అంటే నెలకు రూ.20,500 అవుతుంది.

Advertisement

Also Read: ఇలా చేస్తే ప్రతి నెలా రూ.5000 అకౌంట్లోకి.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా?

పన్ను ప్రయోజనాలు

సీనియర్ సిజిన్స్ సేవింగ్స్ స్కీమ్ లో డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80-C కింద మినహాయింపు ఉంటుంది. దీని వలన SCSS ను పన్ను ఆదా కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అసలుపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం బెసిక్ మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే, వడ్డీ కూడా పన్ను రహితంగా పరిగణించవచ్చు. సంవత్సరానికి రూ.1 లక్ష కంటే ఎక్కువ వడ్డీ వస్తే, దానికి 10% టీడీఎస్ పడుతుంది. మీ మొత్తం ఆదాయం బెసిక్ ట్యాక్స్ స్లాబ్ పరిమితిలోనే ఉంటే.. TDS పడకుండా ఫామ్ 15Hను సబ్మిట్ చేయవచ్చు.

 

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×