E-Paper
Advertisement

APY Scheme: ఇలా చేస్తే ప్రతి నెలా రూ.5000 అకౌంట్లోకి.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా?

APY Scheme: ఇలా చేస్తే ప్రతి నెలా రూ.5000 అకౌంట్లోకి.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా?
Advertisement

APY Scheme: ప్రైవేట్ ఉద్యోగులు, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీగా పెన్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ‘అటల్ పెన్షన్ యోజన'(APY) పథకాన్ని ప్రారంభించింది.

అటల్ పెన్షన్ యోజన స్కీమ్

అటల్ పెన్షన్ పథకం (ఏపీవై) అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏపీవై కింద నెలకు రూ. 1000, 2000, 3000, 4000, 5000 చొప్పున ఖాతాదారులు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల దాటిన తరువాత నెలవారీగా పెన్షన్ అందుతుంది.

ఈ పథకంలో ఎవరు చేరవచ్చు?

Advertisement

1. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఈ పథకంలో చేరవచ్చు.
2. బ్యాంకు లేదా పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి.
3. ఈ పథకంలో రిజిస్టర్ అయ్యే సమయంలో దరఖాస్తుదారుడు తన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను బ్యాంకుకు తెలియజేయాలి. దీంతో ఎప్పటికప్పుడు ఏపీవై ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.

ఎన్ని సంవత్సరాలు చందా చెల్లించాలి?

  • 18 ఏళ్ల వయసులో ఈ పథకం చేరిన వాళ్లు 42 ఏళ్ల పాటు నెలకు రూ.42 చెల్లించాలి.
  • 20 ఏళ్ల వయసులో చేరిన వాళ్లు 40 ఏళ్ల పాటు నెలకు రూ.50 చెల్లించాలి.
  • 25 ఏళ్ల వయసులో చేరిన వాళ్లు 35 ఏళ్ల పాటు నెలకు రూ.76 చెల్లించాలి.
  • 30 ఏళ్ల వయసులో చేరిన వాళ్లు 30 ఏళ్ల పాటు నెలకు రూ.116 చెల్లించాలి.
  • 35 ఏళ్ల వయసులో చేరిన వాళ్లు 25 ఏళ్ల పాటు నెలకు రూ.181 చెల్లించాలి.
  • 40 ఏళ్ల వయసులో చేరిన వాళ్లు 20 ఏళ్ల పాటు నెలకు రూ.291 చెల్లించాలి.
    (నెలకు రూ.1000 పింఛన్ వచ్చేందుకు ప్రీమియం)

నెలకు రూ.5000 పెన్షన్ పొందాలంటే.. 18 ఏళ్ల వయసు వారు రూ.210 చెల్లించాలి. అదే 30 ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ.577 చెల్లించాలి.

Advertisement

ఈ పథకం చేరిన వారి ప్రాన్ నంబర్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. చందాదారులు ఒక సంవత్సరానికి సంబంధించిన మొత్తం చందాను రూ.1000కి మించకుండా ఒకేసారి చెల్లించవచ్చు. దానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఎంత పింఛన్ వస్తుంది?

60 ఏళ్ల దాటిన తర్వాత నెలకు రూ. 1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 చొప్పున ఖాతాదారులు చెల్లించిన ప్రీమియం అనుసరించి పింఛన్ పొందుతారు.

Also Read:  ఏసీ కొనేందుకు ఇదే సరైన సమయం.. 1.5 టన్ విండో ఏసీలపై 50 శాతం ధర తగ్గింపు.. ఎక్కడంటే

ఏపీవై ప్రయోజనాలు

అటల్ పెన్షన్ యోజన ద్వారా కనీస పింఛన్ ప్రయోజనానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. కనీసం పింఛన్ కన్నా.. కట్టిన ప్రీమియం ఎక్కువ అయితే, ఆ మొత్తాన్ని పింఛన్ కు కలిగి లబ్దిదారులకు అందిస్తుంది. ఈ పథకానికి పన్ను మినహాయింపు కూడా ఉంది.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×