Harbhajan Singh: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ దాయాదుల పోరు జరగనున్న సంగతి తెలిసిందే. శ్రీలంక లోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ( India vs Pakistan Match) మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ( Harbhajan Singh). పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు హర్భజన్. అతని సరిగ్గా ఆడక పోతే టీమిండియా జట్టును చీల్చి చెండాడుతాడని హెచ్చరించారు. ఉస్మాన్ తారిక్ ( USMAN TARIQ ) ప్రపంచంలోనే అత్యున్నత మైన స్పిన్నర్ అని.. అలాంటి ప్లేయర్ ను సరిగ్గా ఆడక పోతే టీమిండియా 50 పరుగుల లోపు ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అందరూ కూడా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ గురించే చర్చిస్తున్నారు. అతన్ని టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో ? అని టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను అర్థం చేసుకొని ఆడాలని కోరారు. అతడు అత్యంత భయంకరమైన బౌలర్ అని హెచ్చరించాడు. అతడు బౌలింగుకు దిగగానే కాస్త జాగ్రత్తగా… నెమ్మదిగా ఆడటం బెటర్ అన్నారు. కాస్త అటు ఇటు అయినా… ఇండియాను ఓడించే అంత శక్తి ఉస్మాన్ తారిక్ కు ఇచ్చినట్లే అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు హర్భజన్ సింగ్. కానీ ప్రస్తుతం టీమిండియా చాలా బలంగా ఉంది.. ఇందులో ఎలాంటి డౌట్ లేదు… పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా డీల్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో అస్సలు బరిలోకి దిగకూడదని.. పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఉస్మాన్ తారిక్ ను దెబ్బ కొట్టాలని పేర్కొన్నారు. లేకపోతే పెను ప్రమాదం సంభవించే ఛాన్స్ ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చాడు హర్భజన్ సింగ్.
ఉస్మాన్ తారిక్ కు చెక్ పెట్టేందుకు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అదిరిపోయే ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు. నిన్న ప్రాక్టీస్ సమయంలో అచ్చం ఉస్మాన్ తారిక్ లాగానే టీమిండియా ప్లేయర్ లoదరికీ స్వయంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ తరహాలోనే సూర్య కుమార్ యాదవ్ ఆగి ఆగి బౌలింగ్ చేశారు. దాన్ని టీమిండియా ప్లేయర్లు చాలా దృఢంగా ఎదుర్కొన్నారు. అచ్చం అలాగే మ్యాచ్లో కూడా ఉస్మాన్ ను ఎదుర్కొంటామని సూర్య కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ లో తెలిపారు.
🚨 BIG STATEMENT BY HARBHAJAN ON USMAN TARIQ 🚨
"Usman Tariq is a good spinner. He needs to be played carefully. I feel that he can play a very vital role in deciding the outcome of the match. But Team India is a good team and capable to tackle him" pic.twitter.com/Sbrrfl4UbD
— Richard Kettleborough (@RichKettle07) February 15, 2026