E-Paper
Advertisement

SIP Vs FD VS PPF నెలకు రూ.10 వేల పెట్టుబడి.. 10 ఏళ్లలో రాబడి ఎంతంటే?

SIP Vs FD VS PPF నెలకు రూ.10 వేల పెట్టుబడి.. 10 ఏళ్లలో రాబడి ఎంతంటే?
Advertisement

SIP Vs FD VS PPF: లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ కోసం పెట్టుబడిదారులు ఎక్కువగా మూడు ఆప్షన్ ఎంచుకుంటారు. ఇవి.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIP), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). వీటిలో రిస్క్, రాబడి, ట్యాక్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఈక్విటీ మార్కెట్లలో నెలవారీ పెట్టుబడులు పెట్టడానికి SIP ఉపయోగపడుతుంది. ఇందులో హై రిటర్న్స్ తో పాటు మార్కెట్‌ ఒడిదుడుకులు ఉంటాయి. బ్యాంకులలోని FDలను సంప్రదాయ పెట్టుబడిగా చూస్తారు. ఇవి నిర్థిష్ట హామీతో రాబడులు అందిస్తాయి. లాంగ్ టర్మ్ పెట్టుబడులపై.. ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుంది. మరోవైపు, PPF పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలతో పాటు అస్యూర్డ్ రిటర్న్స్ ఉంటాయి. కానీ ఈ పెట్టుబడులకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ మూడింటిలో 10 ఏళ్ల పాటు నెలకు రూ. 10 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి వస్తుందో తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్

Advertisement

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిప్ (SIP) మార్కెట్‌తో లింక్ అయి రిటర్న్స్ పొందే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇతర పెట్టుబడులతో పోలిస్తే వీటిలో అధిక రిస్క్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ లో సుమారు 12% వార్షిక రాబడిని పొందవచ్చు. ఒకవేళ మీరు సంవత్సరానికి 12% వడ్డీ రేటును ఇచ్చే మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే, 10 సంవత్సరాల తర్వాత మొత్తం పెట్టుబడి రూ.12 లక్షలు. దీనిపై రాబడి రూ. 11,23,391 కాగా, మొత్తం కార్పస్ రూ. 23,23,391 అవుతుంది.

  • నెలవారీ పెట్టుబడి: రూ. 10,000
  • కాల పరిమితి: 10 ఏళ్లు
  • మొత్తం పెట్టుబడి: రూ.12,00,000
  • రాబడి రేటు : 12%
  • రాబడి అంచనా: రూ. 11,23,391
  • మెచ్యూరిటీ కార్పస్: రూ. 23,23,391

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం. వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రస్తుతం ఏడాదికి 7.1%గా ఉంది. ముఖ్యంగా, PPF ఖాతాలలో 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీని పొందవచ్చు. 5 ఏళ్లకొకసారి పొడిగించుకోవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ. 10,000 చొప్పున 15 ఏళ్ల పాటు PPFలో పెట్టుబడి పెడితే రూ. 32,54,567 వస్తాయి. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 18,00,000 కాగా, మొత్తం వడ్డీ రూ. 14,54,567 ఉంటుంది. అంతేకాకుండా, PPF 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు.

Advertisement

Also Read: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు.. తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫిక్స్ డ్ డిపాజిట్లు

FDలలో దాదాపు ఎటువంటి నష్టభయం ఉండదు. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో నిర్ణీత కాలానికి ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకులు నిర్థిష్ట వడ్డీ రేటులను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితికి ఏడాదికి 6% నుంచి 7% మధ్య వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఒక వ్యక్తి సంవత్సరానికి 7% వడ్డీ వచ్చే FDలో రూ. 12 లక్షలు పెట్టుబడి పెడితే, 10 సంవత్సరాల తర్వాత ఆ పెట్టుబడి విలువ రూ.24,01,917లు చేరుకుంటుంది.

  • పెట్టుబడి కాలం: 10 సంవత్సరాలు
  • మొత్తం పెట్టుబడి: రూ. 12 లక్షలు
  • రాబడి: ఏడాది 7%
  • వడ్డీ మొత్తం: రూ. 12,01,917
  • మెచ్యూరిటీ మొత్తం : రూ. 24,01,917

Related News

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..

ఇంజినీరింగ్‌లో 11 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే రూ.50 లక్షల ప్యాకేజీ జాబ్.. సక్సెస్ స్టోరీ

హైదరాబాద్ నుంచి Zomato అవుట్? 250 మంది ఉద్యోగుల తొలగింపు?

డబ్బు సంపాదించడానికి డిగ్రీలు అవసరం లేదు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే ఈ కెరీర్లు బెటర్

బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×