Jananayagan: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో సీనియర్ నటుడు విజయ్ థలపతి(Vijay Thalapathy) ఒకరు. ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈయన ఇటీవల టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన నేపథ్యంలో సినిమాలకు కూడా దూరం అవుతున్నారు. ఇక ఈయన చివరిగా డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో జననాయగన్ (Jananayagan) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. తెలుగులో ఈ సినిమా జననాయకుడు పేరిట విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా సెన్సార్ కారణాల వల్ల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ పూర్తి కానీ నేపథ్యంలో ఈ సినిమా వ్యవహారం పై మద్రాస్ కోర్టులో కేసు ఇప్పటికి నడుస్తోంది. ఇలా ఈ సినిమాకు వరుస ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయంలో విజయ్ అభిమానులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడప్పుడే విడుదల కాదంటూ అభిమానులు ఈ సినిమాపై ఆశలు కూడా వదులుకున్నారు. మరో వైపు నటుడు విజయ్ సైతం తన రాజకీయ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జననాయగన్ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.
సెన్సార్ కారణంగా విడుదల ఆగిపోయిన ఈ సినిమాకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తుంది. సంక్రాంతి నుంచి తప్పుకున్న ఈ సినిమా అన్ని అడ్డంకులను ఎదుర్కొని జూలై నెలలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. జులై నాటికి తమిళనాడు ఎన్నికలు కూడా పూర్తి అవుతాయి ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని అప్పుడు విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు. విజయ్ సైతం రాజకీయాలలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
విజయ్ జోడిగా పూజ హెగ్డే ..
ఈ సినిమాలో విజయ్ జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, నటి మమిత బైజు విజయ్ కూతురి పాత్రలో నటించారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రాజకీయాలు కూడా చుట్టుముట్టాయని తెలుస్తుంది. ఇక విజయ్ ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అనుకున్న విధంగానే జూలైలో విడుదలవుతుందా లేదంటే మళ్లీ వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక విజయ్ ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలతో పాటు తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read: వస్త్రధారణ విషయంలో శివాజీ చెప్పింది నిజమే.. సురేఖ వాణి కూతురు సుప్రీత షాకింగ్ కామెంట్స్!