E-Paper
Advertisement

Mutual Funds Investment: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు.. తెలుసుకోవాల్సిన విషయాలివే

Mutual Funds Investment: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు.. తెలుసుకోవాల్సిన విషయాలివే
Advertisement

Mututal Funds Investment:పెట్టుబడులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మ్యూచువల్‌ ఫండ్స్. పెట్టుబడుల కోసం అనేక రకాల మ్యూచువల్ ఫండ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు.. రిస్క్ ప్రొఫైల్, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలపరిమితి ఇలా కొన్ని విషయాలను పరిశీలించాలి. వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, విభిన్న పెట్టుబడి కాలపరిమితులతో మీ ఆర్థిక లక్ష్యాలకు అనుకూలంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఈక్విటీ ఫండ్లు లాంగ్ టర్మ్ లో అధిక రాబడిని అందిస్తాయి. అయితే ఇవి స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలకు అంతగా అనుకూలం కాకపోవచ్చు.

ఎమర్జెన్సీ ఫండ్స్

డెట్ ఫండ్స్ స్థిరమైన రాబడిని అందిస్తాయి. కాబట్టి, వీటిని ఎమర్జెన్సీ ఫండ్స్, స్వల్పకాలిక లక్ష్యాలను ప్రణాళిక వేసుకునేవారికి ఉపయోగపడతాయి. ఇన్వెస్టర్ తనకు అనుకూలమైన మ్యూచువల్ ఫండ్ కేటగిరీలను షార్ట్‌లిస్ట్ చేసినప్పటికీ, ఆ కేటగిరీలో ఒక నిర్దిష్ట మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకోవడం కూడా చాలా కీలకం. రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు మొదలైన వాటి ఆధారంగా మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, ఇన్వెస్టర్ స్మాల్ క్యాప్ ఫండ్‌ను షార్ట్‌లిస్ట్ చేసుకుంటే.. అది షార్ట్ టర్మ్ గోల్స్ కు అనుకూలంగా ఉండదు.
అలాంటి సమయంలో పెట్టుబడిదారుడి రిస్క్ ప్రొఫైల్‌కు సరిపోయే మ్యూచువల్ ఫండ్ పథకాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఎడిషనల్ ఫండ్స్

Advertisement

లాంగ్ టర్మ్ లక్ష్యాల కోసం లార్జ్ క్యాప్ లేదా మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం బెస్ట్. రిస్క్ పరిమితి ఆధారంగా ఒక స్మాల్ కాప్ ఫండ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా, ఎడిషనల్ ఫండ్స్ ను స్వల్పకాలికంగా ఉంచేందుకు లిక్విడ్ ఫండ్లు లేదా ఓవర్‌నైట్ ఫండ్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ పోర్ట్‌ఫోలియో వ్యవధి కారణంగా ఈ ఫండ్లలో వడ్డీ రేటు రిస్క్, క్రెడిట్ రిస్క్ కాస్త తక్కువగా ఉంటాయి.

బుల్ మార్కెట్

మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా పెట్టుబడులు పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ పనితీరుపై సరైన అవగాహన పొందాలంటే, కేవలం బుల్/బేర్ మార్కెట్ సైకిల్స్‌పై మాత్రమే దృష్టి పెట్టకుండా వివిధ మార్కెట్ సైకిల్స్‌లో ఫండ్ పనితీరును పరిగణనలోకి తీసుకోవాలి. గత రాబడులు భవిష్యత్ రాబడులకు హామీ కాదని పెట్టుబడిదారులు తప్పక గమనించాలి. మార్కెట్లు లాభాల్లో ఉంటే పెట్టుబడిదారులు దీన్ని బుల్ మార్కెట్ అని పిలుస్తారు. స్టాక్స్‌/ఫండ్ యూనిట్ల ధరలు పెరుగుతాయి. పెట్టుబడిదారుల విశ్వాసం బాగా పెరుగుతుంది. అయితే బుల్ మార్కెట్ ఎప్పుడు అయిపోతుంది అనే రిస్క్‌ కూడా ఉంటుంది. బుల్ మార్కెట్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి, రిస్క్‌ను నిర్వహిస్తూనే లాభాలను పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి పెట్టుబడిదారులు తప్పక తెలుసుకోవాలి.

బేర్ మార్కెట్

Advertisement

మ్యూచువల్ ఫండ్లలో బేర్ మార్కెట్ అంటే, మార్కెట్ లో ఫండ్ విలువలు తగ్గడం, ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొని, ఆర్థిక పరిస్థితులలో మందగమనం, కార్పొరేట్ ఆదాయాలు తగ్గడంయ ఇటువంటి సమయాల్లో, పెట్టుబడిదారులను తమ హోల్డింగ్స్‌ను అమ్మేస్తుంటారు. ఇది స్టాక్‌, ఫండ్‌ యూనిట్ల ధరలను మరింత తగ్గిస్తుంది. బేర్ మార్కెట్‌ను ఎదుర్కోవడం పెట్టుబడిదారులకు పెద్ద సవాలు. తమ పెట్టుబడిని కొనసాగించాలా లేదా అమ్మేయాలా అని సందేహాలు మొదలవుతాయి.

లాంగ్ టర్మ్ ప్లానింగ్, అధిక రిస్క్ తట్టుకునే సామర్థ్యం బేర్ మార్కెట్ ఎదుర్కోవడానికి కావాలి. అలాగే బేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది. మార్కెట్ తిరిగి పుంజుకున్నప్పుడు ఈ ప్లానింగ్ మంచి రాబడులను అందిస్తుంది. అయితే, రిస్క్‌కు దూరంగా ఉండే పెట్టుబడిదారులు, కొత్తగా పెట్టుబడి పెట్టే వారు మార్కెట్ పుంజుకునే సిగ్నల్ వచ్చే వరకు వేచి ఉండడం మంచిది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×