E-Paper
Advertisement

Kia PV5 Electric Midsize Van: కియా మరో సంచలనం.. దేశంలో మొదటి ఎలక్ట్రిక్ వ్యాన్.. ప్రత్యేకతలు ఇవే!

Kia PV5 Electric Midsize Van: కియా మరో సంచలనం.. దేశంలో మొదటి ఎలక్ట్రిక్ వ్యాన్.. ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Kia Launching PV5 Electric Midsize Van: ప్రముఖ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో మరో ముందడుగు వేసింది. తన కొత్త మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వ్యాన్‌ను అతి త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీని పేరు Kia PV5. ప్రొడక్షన్-స్పెక్ Kia PV5 2025లో దీన్ని ప్రారంభించడానికి కంపెనీ విదేశాల్లో టెస్ట్ చేస్తోంది.

దీని కాన్సెప్ట్ PV5 ద్వారా ప్రివ్యూ చేయబడింది. కంపెనీ దీనిని జనవరిలో CES 2024 ప్రదర్శనలో కాన్సెప్ట్ PV1, కాన్సెప్ట్ PV7తో పరిచయం చేసింది. దీన్ని ప్రయాణికులను తరలించడానికి, కార్గో డెలివరీకి ఉపయోగించవచ్చు. ఇందులో మల్టీ సీటింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

కంపెనీ చూపిన కాన్సెప్ట్‌తో పోలిస్తే, దాని చివరి మోడల్ కొద్దిగా టోన్ డౌన్‌గా ఉంటుంది. ఇందులో బ్లాక్ స్టీల్ వీల్స్, ట్రెడిషన్ మిర్రర్స్ ఉంటాయి. వీల్ ఆర్చ్‌లు, క్లాడింగ్ కూడా మిడ్‌సైజ్ వ్యాన్‌కి ప్రత్యేకంగా ఉంటాయి. దీని ఫోటోలు జర్మనీలో టెస్టింగ్ సమయంలో తీయబడ్డాయి. ఇది అనేక రంగుల్లో వస్తుంది. ఇది కిట్‌గా సప్లై చేయబడుతుంది. ఈ కిట్‌లను మెకానికల్ కప్లింగ్‌లు, విద్యుదయస్కాంత ఫిక్చర్ పాయింట్‌లను ఉపయోగించి కనెక్ట్ చేయవచ్చు.

Also Read: Royal Enfield Bobber 350: ఎన్ఫీల్డ్ నుంచి 350 సీసీ బైక్.. ధర రూ. 2లక్షలు.. లాంచ్ ఎప్పుడంటే?

Advertisement

కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఈ కారును కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమర్‌లు మూడు రకాల బాడీ టైప్స్‌లో తమ అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగరేషన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుందని కియా స్పష్టం చేసింది. ఇది బేసిక్ ఫర్ ప్యాసింజర్ సర్వీస్, వ్యాన్ ఫర్ డెలివరీ, ఛాసిస్ క్యాబ్ వంటి మోడళ్లలో తీసుకువస్తుంది. ఇది కాకుండా అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని కలిగి ఉన్న PV5  రోబోటాక్సీ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి కియా కృషి చేస్తోంది.

Also Read: Upcoming Electric Cars: పండుగ సీజన్.. కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. రేజ్ చూస్తే మతిపోతుంది!

Kia PV5 డెడికేటెడ్ e-CCPM (ఎలక్ట్రిక్ కంప్లీట్ ఛాసిస్ ప్లాట్‌ఫారమ్ మాడ్యూల్) ప్లాట్‌ఫామ్‌పై వస్తుంది. అయితే దాని ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ స్పెసిఫికేషన్‌లు ప్రస్తుతానికి బయటకు రాలేదు. PV5 PV1, PV7 మధ్యగా ఉంటుంది. ఇది దక్షిణ కొరియా కొత్త తయారీ యూనిట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 1.5 లక్షల యూనిట్లు. భారతీయ మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఈ రకమైన మొదటి ఎలక్ట్రిక్ వాన్ కూడా ఇదే.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×