BigTV English

2 Tried to Kill Me – Elon Musk: నాపై కూడా రెండుసార్లు హత్యాయత్నం జరిగింది: ఎలాన్ మస్క్..!

2 Tried to Kill Me – Elon Musk: నాపై కూడా రెండుసార్లు హత్యాయత్నం జరిగింది: ఎలాన్ మస్క్..!

Two People Tried to Kill me Said by Elon Musk: అమెరికాలోని పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన చెవి గాయంతో బయటపడ్డారు. ఈ క్రమంలో సోషల్ మీడియా(ఎక్స్) ఒక వినియోగదారుడు ఎలాన్ మస్క్ ను ఓ ప్రశ్న అడిగాడు. ‘దయచేసి మీ భద్రతను 3 రెట్లు పెంచుకోండి.. ట్రంప్ కే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మిమ్మల్ని కూడా చంపే ప్రయత్నం చేస్తారు’ అంటూ ఆ యూజర్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.


ఆ పోస్ట్ పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘నేను ప్రమాదకరమైన కాలాన్ని దాటి వచ్చాను. గత 8 నెలల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో నన్ను చంపేందుకు ప్రయత్నించారు. వారు టెస్లా కార్యాలయం సమీపంలో తుపాకులతో అరెస్టయ్యారు’ అంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్ ఆయన కుడి చెవికి తాకింది. గాయపడిన ట్రంప్ ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ట్రంప్ క్షేమంగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.


Also Read: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో ఓ బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లింది. దీంతో ట్రంప్ ఆ స్టేజీపైనే కిందపడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ రక్షణగా చేరారు. వేదిక పైనుంచి కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే స్టేజి పరిసరాల్లో ఉన్న భవనాలను తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. చికిత్స అనంతరం ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది.

Related News

Nobel Prize Chemistry: కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఇదిగో వారి పేర్లు

Attack on president Convoy: అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి.. తప్పించుకున్న ఆ దేశాధినేత

Nobel Prize Physics: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ బహుమతి.. సర్క్యూట్‌లో టన్నెలింగ్ రహస్యాన్ని కనుగొన్నందుకు పురస్కారం

Nobel Prize 2025 Medicine: రోగ నిరోధక వ్యవస్థపై ఆవిష్కరణలు.. వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Nobel Prize Winners: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. వారి పేర్లు ఇవే

Mount Everest: ఎవరెస్ట్‌పై మంచు తుపాను ప్రతాపం.. మూసుకుపోయిన దారులు, చిక్కుకుపోయిన 1000 మంది

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Singapore News: ఇద్దరు భారతీయ టూరిస్టులకు సింగపూర్ కోర్టు షాక్.. హోటల్ గదుల్లో వారిని పిలిచి

Big Stories

×