E-Paper
Advertisement

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా
Advertisement

SSY : పాప పుట్టిందంటే బాధ్యతలతో పాటు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు కూడా మొదలవుతాయి. ఆమెను మంచిగా చదివించాలని.. జీవితంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తనకు రానివ్వకుండా చూడాలని పేరెంట్స్‌ కోరుకుంటారు. అలాంటి కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. బాలికల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ పథకం ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఆకర్షణీయమైన రాబడిని అందిస్తోంది.

సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకత ఏంటి ?

10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తె పేరుతో SSY ఖాతాను ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను నిర్వహించవచ్చు. అకౌంట్ ప్రారంభించిన తర్వాత ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 జమ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది.

Advertisement

ఈ పథకానికి మరో ప్రధాన ఆకర్షణ పన్ను మినహాయింపులు. ఖాతాలో జమ చేసే మొత్తంపై, దానికి వచ్చే వడ్డీపై, అలాగే మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తంపై కూడా పన్ను ఉండదు. దీనికారణంగా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్న కుటుంబాలకు ఇది మరింత బెనిఫిట్‌గా మారుతోంది. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల వరకు ఖాతాలు తెరవడానికి అనుమతి ఉంటుంది. అయితే కవలలు లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది కుమార్తెలకు కూడా ఖాతాలు ప్రారంభించే అవకాశం ఉంది.

సుకన్య సమృద్ధి యోజనలో ఖాతా ప్రారంభించిన తర్వాత 15 సంవత్సరాల పాటు పెట్టుబడులు కొనసాగించాలి. అయితే ఖాతా పూర్తి మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు ఉంటుంది. కుమార్తెకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం జరిగే పరిస్థితి ఉంటే ఖాతాను ముందుగానే క్లోజ్‌ చేసి మొత్తాన్ని పొందే వెసులుబాటు కూడా ఉంది. అలాగే ఉన్నత విద్య అవసరాల కోసం కూడా నిర్దిష్ట నిబంధనల ప్రకారం కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Also Read : శాప గ్రస్త అడవిలో ఒంటరి మహిళ… ఓటీటీని వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

ఎంత బెనిఫిట్‌ పెడితే ఎంత ప్రయోజనం? :

దీర్ఘకాలంలో ఈ పథకం ఎంతటి ప్రయోజనం అందిస్తుందో ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక సంవత్సరం వయస్సు ఉన్న కుమార్తె పేరుతో ఇప్పుడే ఖాతా ప్రారంభించి, ప్రతి సంవత్సరం రూ.1,09,000 చొప్పున పెట్టుబడి పెడితే, ప్రస్తుతం అమలులో ఉన్న 8.2 శాతం వడ్డీ రేటు ఆధారంగా 2047లో ఖాతా మెచ్యూర్ అయ్యే సమయానికి సుమారు రూ.50,34,040 లభించే అవకాశం ఉంటుంది. అంటే క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ద్వారా కుమార్తె భవిష్యత్తు కోసం 50 లక్షల రూపాయలకు పైగా నిధిని సమకూర్చుకోవచ్చు.

పెరుగుతున్న విద్యా ఖర్చులు, వివాహ వ్యయాలు, భవిష్యత్తు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే సుకన్య సమృద్ధి యోజన కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు. కుమార్తె భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించే దీర్ఘకాలిక భద్రతా కవచంగా కూడా ఇది నిలుస్తోంది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన పెట్టుబడి కాలక్రమేణా భారీ నిధిగా మారడం పక్కా!

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×