E-Paper
Advertisement

Tata Cars Discounts May 2024: టాటా కార్లపై ఆఫర్లే ఆఫర్లు.. నెక్సాన్, టియాగో, ఆల్ట్రోజ్, టిగోర్‌‌పై భారీగా డిస్కౌంట్లు..!

Tata Cars Discounts May 2024: టాటా కార్లపై ఆఫర్లే ఆఫర్లు.. నెక్సాన్, టియాగో, ఆల్ట్రోజ్, టిగోర్‌‌పై భారీగా డిస్కౌంట్లు..!
Advertisement

Tata Cars Discount Offers: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మే నెలలో తన వాహనాలపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఎంపిక చేసిన టాటా వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా రూ.60,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటే తక్కువ ధరలో కారును సొంతం చేసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం. ఏయే వాహనాలపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.

Tata Tiago (టాటా టియాగో)

Advertisement

టాటాకి చెందిన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ టియాగో కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో పెట్రోల్ వేరియంట్‌లైన XT(O), XT, XZపై ఏకంగా రూ. 60,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అందులో మొత్తం నగదు రూపంలో కాకుండా.. రూ. 45,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ ప్రయోజనం అందుబాటులో ఉన్నాయి. టియాగో మిగిలిన పెట్రోల్ మోడల్స్‌పై రూ. 35,000 నగదు తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో Tiago CNG మోడల్‌పై రూ. 25,000 నగదు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇది కాకుండా అన్ని మోడళ్లపై ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

Tata Altroz (టాటా ఆల్ట్రోజ్)

Advertisement

Tata Altrozలో డీజిల్, పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT) వాహనాలపై రూ. 50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తున్నాయి. Altroz ​CNG మోడల్‌పై రూ. 35,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

Also Read: దేశంలో ది బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. సింగిల్ ఛార్జింగ్‌తో మైలేజ్ 300 కీ.మీ పై మాటే!

Tata Tigor (టాటా టిగోర్)

టాటా టిగోర్‌పై రూ.55,000 వరకు తగ్గింపు లభిస్తుంది. Tigor XZ+, XM మోడల్స్‌లో రూ. 40,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ ప్రయోజనం వంటివి ఉన్నాయి. మిగిలిన వేరియంట్లపై రూ.30,000 వరకు తగ్గింపు ఉంది. Tigor CNG వేరియంట్‌పై రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను పొందుతారు.

Tata Nexon (టాటా నెక్సాన్)

Nexon SUV డీజిల్ మోడల్‌పై రూ. 20,000 తగ్గింపు అందుబాటులో ఉంది. అందులో రూ. 15,000 నగదు తగ్గింపు, రూ.5,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. అదే సమయంలో పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 10,000 నగదు తగ్గింపు, రూ.5,000 కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉంది.

ఈ వాహనంపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ బోనస్ లేదు. టాటా పంచ్‌పై కేవలం రూ.3,000 మాత్రమే కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. కొన్ని డీలర్‌షిప్‌లు హారియర్, సఫారీ SUVలపై రూ. 75,000 వరకు నగదు తగ్గింపు, రూ. 50,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నాయి. అయితే ఈ తగ్గింపు వాహనం మోడల్, కలర్ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులో ఎటువంటి సందేహాలున్నా.. సరైన సమాచారం కోసం మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

Tags

Related News

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

Big Stories

Advertisement
×