BigTV English

RGV: తెలంగాణ సీఎంతో వివాదాస్పద దర్శకుడు భేటీ.. కారణం ఏంటో.. ?

RGV: తెలంగాణ సీఎంతో వివాదాస్పద దర్శకుడు భేటీ.. కారణం ఏంటో.. ?

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. మే 19 న తెలుగు డైరెక్టర్స్ డే ఈవెంట్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ ఈవెంట్ కు రావాలని డైరెక్టర్స్ అందరూ కలిసి సినీ, రాజకీయ ప్రముఖులను ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తున్నారు.


ఇక నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు దర్శకులు.. డైరెక్టర్స్ డే ఈవెంట్ కు రమ్మని ఆహ్వానించారు. ఆయన కూడా ఎంతో గౌరవంగా కచ్చితంగా ఈవెంట్ కు వస్తాను అని తెలిపారు . అయితే.. ఇక్కడ అందరి డైరెక్టర్స్ తో పాటు ఇంకో డైరెక్టర్ కూడా ఉండడం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. అతనే వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.

వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అలాంటింది.. ఇప్పుడు ఎలాంటి వివాదం లేకుండా సీఎం ను కలవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఫోటోను షేర్ చేసిన వర్మ.. మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ” నా ప్రియమైన స్నేహితుడు మరియు ఫైర్‌క్రాకర్‌ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.


అయితే వర్మ..సీఎం ను కలవడానికి కారణం ఏంటి.. ? అందరు డైరెక్టర్స్ తో పాటు వెళ్లాడా.. ? లేకపోతే వేరేపని మీద వెళ్లాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ ఒకే ఫ్రేమ్ లో సూపర్ అని కొందరు అంటుండగా.. వర్మను ఎందుకు కలిశారు.. సీఎం గారు.. దూరం పెట్టండి అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ డైరెక్టర్స్ ఈవెంట్ ఏ రేంజ్ లో జరగనుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×