BigTV English

Best Cars Under @ Rs 5 Lakhs: మిడిల్ క్లాస్ కార్లు.. మైలేజ్ లలో బైక్ కంటే ఈ కార్లే బెటర్!

Best Cars Under @ Rs 5 Lakhs: మిడిల్ క్లాస్ కార్లు.. మైలేజ్ లలో బైక్ కంటే ఈ కార్లే బెటర్!

Best Cars Under Rs 5 Lakhs for Middle Class Families: కారు కొనడం అనేది దాదాపు ప్రతి మిడిల్ క్లాస్ ప్రజల కల. కానీ చాలా మంది తక్కువ బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఆఫర్ట్‌‌బుల్ ప్రైస్‌లో తక్కువ ధరకే కార్లను మార్కెట్‌‌లోకి లాంచ్ చేస్తున్నాయి. మిడిల్ క్లాస్ ప్రజలు కూడా ఈ కార్లను కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు రూ. 5 లక్షలలోపు బెస్ట్ కారును కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకోసం అదిరిపోయే నాలుగు కార్లు ఉన్నాయి. అంతే కాదు దీని మైలేజీ కూడా లీటరుకు 20 కి.మీ కంటే ఎక్కువ. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.


Maruti Alto 800
మీ బడ్జెట్ రూ. 5 లక్షల లోపు ఉంటే మీరు ఈ మారుతి కారును మీ సొంతం చేసుకోవచ్చు. మారుతి ఆల్టో 800 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.54 లక్షలు. ఈ కారు లీటరుకు 22.05 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన కారు. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు.

Also Read: యమహా నుంచి స్పెషల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అదరగొడుతున్న టెక్నాలజీ!


మారుతి ఆల్టో 800 0.8L F8D పెట్రోల్,  CNG అనే రెండు ఇంజన్ వేరియంట్‌లో వస్తుంది. పెట్రోల్ వెర్షన్ 47.3 బిహెచ్‌పి పవర్, 69 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. కాగా CNG వెర్షన్‌ 40 bhp పవర్, 60 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. ఈ కారు స్టాక్ సేల్‌కు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కంపెనీ తన తయారీని నిలిపివేసింది.

Maruti Alto K10
మారుతి ఆల్టో K10 కూడా భారతదేశంలోని చౌకైన కార్లలో ఒకటి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు. ఈ కారు లీటరుకు 24.39 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 1.0L K-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 67 bhp, 90 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

Also Read: ఇన్నాళ్లకు దొరికింది.. రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ తెలిస్తే!

Maruti s Presso
మారుతి S-ప్రెస్సో మంచి ఆఫర్డ్‌‌బుల్ ప్రైస్‌తో వస్తుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.26 లక్షలు. ఇందులో 1.0L K10B పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 67 bhp పవర్‌, 90 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది. ఈ కారు మైలేజీ లీటరుకు 24.76 కి.మీ ఇస్తుంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×