BigTV English

Yamaha Unique EV Launch: యమహా నుంచి స్పెషల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అదరగొడుతున్న టెక్నాలజీ..!

Yamaha Unique EV Launch: యమహా నుంచి స్పెషల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అదరగొడుతున్న టెక్నాలజీ..!

Yamaha Electric Scooter Launch: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ వేగంగా పెరిగింది. ఈ సెగ్మెంట్‌లో ప్రజలు ఓలా స్కూటర్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ డిమాండ్ పెరుగుదలను చూసిన ప్రముఖ జపనీస్ కంపెనీ యమహా మోటార్ దేశీయ మార్కెట్‌లో ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ యమహా Unique EVని  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం యమహా కంపెనీ జపనీస్, భారతీయ అనుబంధ సంస్థలతో కలిసి  ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాయి. రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన పర్ఫామెన్స్, అత్యధిక స్పీడ్‌తో పాటు కూల్ స్టైలింగ్‌పై ఆధారపడి ఉంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. గత సంవత్సరం యమహా మోటార్ EV స్టార్టప్, రివర్ మొబిలిటీలో రూ. 332 కోట్లు పెట్టుబడి పెట్టింది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం లాభదాయకం కాదని యమహా కంపెనీ వెల్లడించింది. అనేక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీలు మార్కెట్లో EV టెక్నాజీని అర్థం చేసుకోవడానికి కృషి చేస్తున్నాయి. అదనంగా ఇటీవలి మీడియా నివేదికల ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యూనిక్యూ (18 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా డెవలప్ చేస్తున్నారు.


Also Read: రికార్డులు బ్రేక్.. భారీగా పెరిగిన హీరో స్ప్లెండర్ సేల్స్!

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోటీ మార్కెట్‌లో మా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో ప్రారంభించి, అమ్మకాలను పెంచుకోవడం కూడా కష్టమైన పని అని తెలిపారు. భారతదేశంలో చాలా మంది ఈ స్కూటర్ కొనుగోలుదారులు దాని ధర కంటే పర్యావరణ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీకి  ఆకర్షితులవుతున్నారు. ఇది యూరోపియన్ మార్కెట్‌లో మొదటి ప్రాధాన్యతగా ఉంది.

యమహా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తుంది. ప్రస్తుతం ఉన్న ICE ఇంజన్‌తో కూడిన బైకులు, స్కూటర్‌లను యమహా లాంచ్ చేయనుంది. యమహా మొత్తం విక్రయాల్లో ఈ సెగ్మెంట్ వాటా 70 నుంచి 80 శాతం. 2030 నాటికి యమహా ఒకటి లేదా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Also Read: అంబానీ అదుర్స్.. ఫ్రీగా 13 ఓటీటీలు.. ఇదే అసలైన పండగ!

ఇది కాకుండా వాహన ఉద్గారాలను తగ్గించడానికి ఇథనాల్, బయో ఫ్యూయల్ మంచి ఎంపిక అని కంపెనీ అభిప్రాయం. డిసెంబర్‌లో యమహా ప్రస్తుత ప్లాన్ భారతదేశం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో ప్రీమియం బైకులను విక్రయంపై దృష్టి పెట్టింది. ఇది కాకుండా యమహా భారతదేశంలో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

Tags

Related News

క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాలు కొనవచ్చా..? కొంటే ఎదురయ్యే లాభనష్టాలు ఏంటి..?

Gold Rate: అమెరికాలో బంగారం ధర తక్కువగా ఉంటుందా..? యూఎస్ నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..

Personal Finance: రూ. 50 లక్షల హోం లోన్ సైతం…ఈఎంఐ కడుతూ కేవలం 10 సంవత్సరాల్లో అప్పు తీర్చడం ఎలా..?

Airtel Xstream Fiber: ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఆఫర్.. నెలకు రూ.250 సేవ్ చేసుకోండి

Vi Business Plus: వ్యాపారానికి ఉత్తమ 5జి ప్లాన్.. విఐ బిజినెస్ ప్లస్ ప్రత్యేక ఆఫర్

Flipkart Big Billion Days: స్మార్ట్‌ఫోన్‌ కొనే టైమ్‌ వచ్చేసిందోచ్! ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ డిస్కౌంట్లు!

Jio Cricket Offer: క్రికెట్ అభిమానుల కోసం జియో కొత్త ఆఫర్..మూడు నెలలు లైవ్ క్రికెట్.. కానీ చిన్న ట్విస్ట్?

DMart Ready App: డీమార్ట్ బంపర్ ఆఫర్.. 50శాతం వరకు డిస్కౌంట్లు, మూడు ఆర్డర్లకు ఉచిత డెలివరీ

Big Stories

×