E-Paper
Advertisement

BSNL Annual Plans 2026: వెరీ చీపెస్ట్ ప్లాన్స్.. రోజుకు రూ.3 ఖర్చుతో.. ఏడాదిపాటు ఫ్రీ కాల్స్, 3GB హైస్పీడ్ డేటా!

BSNL Annual Plans 2026: వెరీ చీపెస్ట్ ప్లాన్స్.. రోజుకు రూ.3 ఖర్చుతో.. ఏడాదిపాటు ఫ్రీ కాల్స్, 3GB హైస్పీడ్ డేటా!
Advertisement

BSNL Annual Plans 2026: బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం తక్కువ ధరకే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే చౌక ధరకే.. మెరుగైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు పెద్ద ఎత్తున మెుబైల్ యూజర్లు మారిపోతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం.. టాప్ – 5 చౌకైన వార్షిక రీఛార్జ్ ప్లాన్స్ ను ఇక్కడ అందించడం జరుగుతోంది. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

రూ. 1,198 ప్లాన్

దీనిని సిమ్ యాక్టివ్ గా ఉంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లో అతి చౌకైన వార్షిక ప్లాన్ ఇదే కావడం గమనార్హం. రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అంటే రోజుకు దాదాపు రూ.3  ఖర్చు చేస్తే చాలు. ప్రతీ నెలా 300 నిమిషాల ఉచిత కాలింగ్, 3GB డేటా హైస్పీడ్ డేటా (ప్రతీ నెల), నెలకు 30 SMSలు లభిస్తాయి.

రూ. 1,499 ప్లాన్

Advertisement

ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడేవారి కోసం BSNL ఈ వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. 336 రోజుల కాలానికి అపరిమిత కాల్స్, 24GB డేటా (ప్లాన్ మెుత్తానికి), రోజుకు 100 SMSలను యూజర్లు పొందవచ్చు.

రూ. 1,999 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ కు చెందిన పాపులర్ వార్షిక ప్లాన్స్ లో ఇదీ ఒకటి. 365 రోజుల వ్యాలిడితో రోజూ అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 100 SMSలు దీని ద్వారా పొందవచ్చు. అలాగే ప్రతీరోజు 1.5GB హైస్పీడ్ డేటా సైతం లభిస్తుంది.

రూ. 2,399 ప్లాన్

Advertisement

ఏడాది కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే బడ్జెట్ వార్షిక ప్లాన్ కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. 395 రోజుల (13 నెలలు) వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్ లభిస్తాయి. అలాగే ప్రతీరోజూ 2GB డేటా, 100 SMSలు పొందవచ్చు.

Also Read: SIM Card: సిమ్ కార్డు అంచున కటింగ్ గమనించారా? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ?

రూ. 2,626 భారత్ కనెక్ట్ ప్లాన్

2026 రిపబ్లిక్ డేను పురస్కరించుకొని బీఎస్ఎన్ఎల్ భారత్ కనెక్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. డేటాను అధికంగా వినియోగించేవారికి ఇది బెస్ట్ వార్షిక ప్లాన్ గా చెప్పవచ్చు. 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. అలాగే రోజుకు 2.6GB డేటా, 100 SMSలు లభిస్తాయి.

గమనిక: రాష్ట్రాలను బట్టి బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్స్ లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. కాబట్టి రీఛార్జ్ చేసుకునే ముందు BSNL SelfCare యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఒకసారి ప్లాన్ కు సంబంధించిన ప్రయోజనాలను రీచెక్ చేసుకుంటే బెటర్.

Also Read: Dishwasher Buying Guide: డిష్‌వాషర్ కొనే ముందు.. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే బాధ పడాల్సి వస్తుంది!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×