E-Paper
Advertisement

Dishwasher Buying Guide: డిష్‌వాషర్ కొనే ముందు.. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే బాధ పడాల్సి వస్తుంది!

Dishwasher Buying Guide: డిష్‌వాషర్ కొనే ముందు.. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే బాధ పడాల్సి వస్తుంది!
Advertisement

Dishwasher Buying Guide: వంట పాత్రలు తోమడానికి మించిన శ్రమ మరొకటి లేదని చాలా మంది మహిళలు చెబుతుంటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నిత్యం ఏదోక రూపేన వచ్చి పడే గిన్నెలను కడగడానికే రోజులో సగం సమయంతా అయిపోతుందని వాపోతుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా మార్కెట్ లో చాలా రకాల డిష్ వాషర్లు అందుబాటులో వచ్చాయి. అయితే వాటిని కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాలను తప్పకుండా గమనించాలి.

కెపాసిటీ – ప్లేస్ సెట్టింగ్స్

సాధారణంగా డిష్ వాషర్లలోనే ప్రధాన ఫీటర్లలో ప్లేస్ సెట్టింగ్స్ ఒకటి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారనే దానిని బట్టి ఈ ప్లేస్ సెట్టింగ్స్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదారణహకు 2-3 సభ్యులు ఉండే కుటుంబానికి 8–10 ప్లేస్ సెట్టింగ్స్ సరిపోతాయి. 4-6 కుటుంబ సభ్యులు ఉంటే 12- 15 ప్లేస్ సెట్టింగ్స్ ఉన్న డిష్ వాషర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్లేస్ సెట్టింగ్స్ సామర్థ్యం ఎంత పెరిగితే అందులో అన్ని పెద్ద గిన్నెలు, కడాయిలు పడతాయని గుర్తుంచుకోండి.

వాష్ ప్రోగ్రామ్స్ (Wash Programs)

Advertisement

భారతీయుల వంటకాలు విభిన్నంగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటికి అనుగుణంగా కొన్ని బ్రాండ్స్ ప్రత్యేకమైన వాష్ ప్రోగ్రామ్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు Intensive Kadhai Mode ప్రోగ్రామ్ ను.. నూనె, మసాలా జిడ్డు ఎక్కువగా ఉండే కడాయిలు, కుక్కర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. Eco Mode.. తక్కువ నీరు, విద్యుత్ ఖర్చు అయ్యేలా చేస్తుంది. Quick Wash ఫీచర్ ను.. తక్కువ జిడ్డు ఉన్న గ్లాసులు, ప్లేట్ల కోసం రూపొందించారు.

డిష్ వాషర్లలోని ర్యాక్స్

మనం వాడే పాత్రలు రకరకాల సైజుల్లో ఉంటాయి. పప్పు గిన్నెలు, పొడవైన గ్లాసులు, ఆహారం తినే ప్లేట్లు వివిధ సైజుల్లో ఉంటాయి. కాబట్టి Adjustable Racks లేదా Foldable Tines ఉన్న మోడల్స్ ఎంచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల పాత్రలను సర్దుకోవడం సులభం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

తక్కువ నీరు – విద్యుత్ ఆదా

Advertisement

క్వాలిటీ డిష్ వాషర్ ఒక సైకిల్ (ఒక ట్రిప్)కు 9-12 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తుంది. కాబట్టి అలాంటి డిష్ వాషర్ మార్కెట్ లో ఏది ఉందో చూసి ఎంచుకుంటే మంచింది. ఎందుకంటే సమ్మర్ లో నీటి ఎద్దడి అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువ నీటితో పాత్రను కడిగే డిష్ వాషర్ ఎంతో అవసరం. మరోవైపు A++ లేదా A+++ ఎనర్జీ రేటింగ్ ఉన్నవి ఎంచుకుంటే కరెంటు బిల్లు ఆదా అవుతుంది.

Also Read: Air Force Recruitment Rally: తెలుగు యువతకు గుడ్ న్యూస్.. భారత వాయుసేనలో చేరే సువర్ణవకాశం!

డ్రైయింగ్ టెక్నాలజీ

కడిగిన తర్వాత పాత్రలు తడి లేకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. Hot Air Drying లేదా Zeolith Drying వంటి ఫీచర్లు ఉన్న డిష్ వాషర్ ను పరిశీలించండి. దీనివల్ల పాత్రలపై నీటి చుక్కల మరకలు పడవు.

Also Read: Parvathi Melton : బాపురే.. అరాచకమే.. ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న పార్వతి..

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×