E-Paper
Advertisement

Bajaj Platina vs Hero Splendor: బజాజ్ ప్లాటినా vs హీరో స్ప్లెండర్ ప్లస్.. రెండింటిలో ఏది బెస్ట్ బైక్?

Bajaj Platina vs Hero Splendor: బజాజ్ ప్లాటినా vs హీరో స్ప్లెండర్ ప్లస్.. రెండింటిలో ఏది బెస్ట్ బైక్?
Advertisement

Bajaj Platina vs Hero Splendor Comparison: తక్కువ ధరలో ఎక్కువ మైలేజీతో ఆకట్టుకునే బైకుల కోసం మిడిల్ క్లాస్ జనాలు వెతుకుతుంటారు. అయితే, గ్రామీణ అవసరాలకు అనుకూలంగా ఉండే రెండు చీప్ బెస్ట్ బైకులు బజాజ్ ప్లాటినా, హీరో స్ప్లెండర్ ప్లస్.  ఈ రెండు బైకులు 100cc విభాగంలో అద్భుతమైన మైలేజ్, నమ్మకమైన పనితీరును అందిస్తున్నాయి. ఈ రెండు బైకులు ఇంచుమించు 70 నుంచి 75 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తున్నాయి.

బజాజ్ ప్లాటినా vs హీరో స్ప్లెండర్ ప్లస్ మధ్య పోలికలు

 

ఇంజిన్, పెర్ఫార్మెన్స్

Advertisement

⦿ప్లాటినా 100: 102cc ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 8.34Nm టార్క్ ను అందిస్తుంది. గ్రామీణ అవసరాలకు అనుకూలంగా ఉంది. ఎక్కువ మన్నికైన బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ స్ప్లెండర్ ప్లస్ Xtec: ఈ బైక్ 97.2cc ఇంజిన్‌ తో వస్తుంది. చాలా స్మూత్ పని తీరును కలిగి ఉంటుంది. దీని i3S (Idle Stop Start System) టెక్నాలజీ ట్రాఫిక్‌ లో ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

మైలేజ్ గురించి..

Advertisement

రెండు బైక్‌లు మంచి మైలేజీని ఇస్తాయి. ప్లాటినా 100 కాస్త ఎక్కవ మైలేజ్ ఇస్తుంది. లీటర్ కు 75 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.  స్ప్లెండర్ ప్లస్ Xtec సుమారు 70 నుంచి 73 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది.

 ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

⦿ స్ప్లెండర్ ప్లస్ Xtec: ఈ బైక్ లో ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, SMS అలర్ట్స్, USB ఛార్జింగ్ పోర్ట్, LED DRLలను అందిస్తుంది.

⦿ ప్లాటినా 100: బేసిక్ కన్సోల్ తో వస్తుంది. దీని కంఫర్ట్‌ టెక్  టెక్నాలజీ వల్ల సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. లాంగ్ రైడ్స్‌ కి బాగుంటుంది.

 డిజైన్, సౌకర్యం

⦿ ప్లాటినా 100: లాంగ్, సాఫ్ట్ సీటు, ఎక్కువ సస్పెన్షన్ ట్రావెల్ వల్ల గతుకుల రోడ్లపై కూడా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ స్ప్లెండర్ ప్లస్ Xtec: స్టైలిష్ గ్రాఫిక్స్, కొత్త రంగులతో వస్తుంది. తేలికపాటి బరువు వల్ల నడపడం సులభంగా ఉంటుంది.

ఏ బైక్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

ఒకవేళ తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, సౌకర్యవంతమైన ప్రయాణం  కావాలంటే.. బజాజ్ ప్లాటినా 100 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా డిజిటల్ ఫీచర్లు, బ్రాండ్ ఇమేజ్, మోడ్రన్ లుక్ కావాలంటే హీరో స్ప్లెండర్ ప్లస్ Xtecను తీసుకోవడం మంచిది.

Read Also: యూత్ కు గుడ్ న్యూస్, క్రేజీ టీవీఎస్ అపాచీ వచ్చేస్తోంది!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×