E-Paper
Advertisement

TVS Ntorq 125: యూత్‌ని మైమరపిస్తున్న స్కూటర్.. సరికొత్త కలర్స్‌లో టీవీఎస్‌ ఎన్‌టార్క్ విడుదల..!

TVS Ntorq 125: యూత్‌ని మైమరపిస్తున్న స్కూటర్.. సరికొత్త కలర్స్‌లో టీవీఎస్‌ ఎన్‌టార్క్ విడుదల..!
Advertisement

TVS Ntorq 125 New Colour Options: టీవీఎస్ స్కూటర్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందులో టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ ఒకటి. ఈ స్కూటర్ తన పనితీరు, డిజైన్, స్పోర్టీ లుక్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో ఎన్‌టార్క్ 125, ఎన్‌టార్క్ రేస్ 125 ఎక్స్‌పి ఉన్నాయి. అయితే ఈ స్కూటర్ ఇప్పుడు మరికొన్ని అప్‌డేట్‌లతో వచ్చింది. టీవీఎస్ మోటార్స్ తాజాగా ఈ స్కూటర్‌ను మరొక కొత్త కలర్స్‌ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ఇది ఇతర టీవీఎస్ స్కూటర్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ లుక్‌ను కలిగిఉంది.

కొత్త కలర్లలో వచ్చిన ఈ స్కూటర్ దాని డిజైన్, స్పోర్టీ లుక్‌తో యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. కొత్తగా వచ్చిన ఈ స్కూటర్‌లో కంపెనీ ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కాస్త కాస్మోటిక్ ఛేంజెస్ చేసింది. దీని కారణంగా ఈ టీవీఎస్ స్కూటర్‌లు టర్కోయిస్, నార్డో గ్రే, హార్లెక్విన్ బ్లూ వంటి కొత్త ఆప్షన్‌లలో ఇప్పుడు వచ్చాయి. ఇక కొత్తగా వచ్చిన ఈ టీవీఎస్ ఎన్‌టార్క్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అసిస్ట్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, కాలర్ ఐడీ, LCD ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఇవ్వబడ్డాయి.

Advertisement

Also Read: స్కూటర్ ధరలు తగ్గాయ్.. తొందరగా కొనేయండి బాసు.. మళ్లీ ఇలాంటి ఆఫర్ కష్టమే..!

ఈ ఫీచర్లతో పాటు డ్యూయల్ రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ 124.8 సిసి 3 వాల్వ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 7000ఆర్‌పిఎమ్ వద్ద 9.5 పిఎస్ పవర్, 5500 ఆర్‌పిఎం వద్ద 10.6 ఎన్‌ఎమ్ టార్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. ఈ స్కూటర్ రూ.86,871 ఎక్స్ షోరూమ్ వద్ద రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే ఎన్‌టార్క్‌ రేస్ XP సిరీస్‌ను ‘మ్యాట్ బ్లాక్ స్పెషల్ ఎడిషన్’లో అందుబాటులోకి తెచ్చారు.

Advertisement

ఇది చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో కూడా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, 20కి పైగా వాయిస్ అసిస్ట్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ అసిస్ట్, కాలర్ ఐడీ, LCD ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, కాల్ అలర్ట్, ఎస్ఎంఎస్ అలర్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 124.8 సీసీ 3 వాల్వ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.2 పిఎస్ పవర్, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.9 ఎన్‌ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర విషయానికి వచ్చే సరికి కంపెనీ దీనిని రూ.97,501 ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ చేసింది.

Tags

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×