AP Ex Deputy CM Alla Nani Resign(Andhra politics news): వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారు. కొన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైసీపీ సీనియర్ నేతగా వ్యవహరిస్తున్న ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.
అలాగే, జిల్లా అధ్యక్ష పదవితోపాటు ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతోపాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని వెల్లడించాడు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించాడు.
ఆళ్ల నాని.. 1994, 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
అనంతరం 2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుపొందారు. దీంతో జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఓటమి చెందారు.
Also Read: ఆదివాసీల అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం : సీఎం చంద్రబాబు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. అలాగే ఆళ్ల నాని ఏటూరు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. కాగా, ఇప్పటికే వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.