Godawari Electric Scooters: దేశీయ మార్కెట్ ఆటో మొబైల్ రంగంలో రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుంది. ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలు తమ వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తూ సేల్స్ మరింత పెంచుకుంటున్నాయి. అలాంటిదే తాజాగా ఓ కంపెనీ తమ స్కూటర్లపై క్రేజీ డిస్కౌంట్లు ప్రకటించింది. పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో చాలా వాహనాల తయారీ కంపెనీలు ఆఫర్లు అందిస్తూ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్స్‌ని ఉత్పత్తి చేస్తున్న ప్రముఖ వాహనాల తయారీ సంస్థ గోదావరి ఎలక్ట్రిక్ తమ స్కూటర్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది.
ఈ గోదావరి ఎలక్ట్రిక్ కంపెనీ తాజాగా మాన్‌సూన్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో ఇబ్లూ బ్రాండ్ పేరుతో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్లు అందిస్తుంది. అందులో ఇబ్లూ ఫియో, ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై దాదాపు రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. మాన్‌సూన్ ధమాకా ఆఫర్ కింద ఈ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రెండు స్కూటర్లలో ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవలే లాంచ్ అయింది. ఇంతలోనే ఈ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం అనే చెప్పాలి. మార్కెట్‌లో ఈ రెండు స్కూటర్లు ఒకే విధంగా రూ.99,999 ధరతో ఉన్నాయి. ఇప్పుడు రూ.10,000 డిస్కౌంట్‌తో ఇబ్లూ ఫియో, ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ.89,999కి కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలుగా ఉన్నాయి.
Also Read: మహిళల కోసం బెస్ట్ స్కూటీలు.. ఈ ధరలో దొరకడం అదృష్టమే.. మైలేజీ అదుర్స్..!
అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నెల అంటే ఆగస్టు 31, 2024 వరకు మాత్రమే ఈ క్యాష్ డిస్కౌంట్ పొందుతారు అని గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.36 కెడబ్లూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీకి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే దాదాపు 110 కి.మీ మైలేజీ అందిస్తుంది. అయితే ఫుల్ ఛార్జ్ కావడానికి 5.25 గంటల సమయం పడుతుంది.
ఇందులో మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకానమీ, నార్మల్, పవర్. దీనిని సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, డెలీ గ్రే, ట్రాఫిక్ వైట్ కలర్ ఆప్షన్లలో కొనుక్కోవచ్చు. ఈ స్కూటర్‌లో కాంబీ బ్రేక్ సిస్టమ్ అమర్చారు. దీని కారణంగా ఎంతటి స్పీడ్‌లోనైనా చాలా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఇందులో బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేసుకుని యాక్సస్ చేసుకోవచ్చు. నావిగేషన్ అందించారు. 7.4 ఇంచుల డిజిటల్ ఫుల్ కలర్ డిస్‌ప్లే అందించారు. దీనితో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.