E-Paper
Advertisement

Punch Money IKEA Brand: ఒక కోతి పిల్ల.. ఒక సాఫ్ట్ టాయ్.. ట్రెండింగ్‌లోకి ఐకియా, ఆ బ్రాండ్‌కు ఊహించని క్రేజ్.. ఎందుకంటే?

Punch Money IKEA Brand: ఒక కోతి పిల్ల.. ఒక సాఫ్ట్ టాయ్.. ట్రెండింగ్‌లోకి ఐకియా, ఆ బ్రాండ్‌కు ఊహించని క్రేజ్.. ఎందుకంటే?
Advertisement

Punch Money IKEA Brand: జపాన్‌లోని ఒక జూలో ఒక కోతి పిల్ల ఐకియా బ్రాండ్ కు ఊహించని క్రేజ్ తెచ్చింది. ప్లష్ బొమ్మను ఒక గ్లోబల్ బ్రాండ్ గా మార్చేసింది. పంచ్ అనే పిల్ల కోతిని తల్లికోతి వదిలివేసింది. ఇతర కోతులు కూడా ఈ పిల్ల కోతిని దూరం పెట్టాయి. దీంతో జూ సంరక్షకులు ఆ పిల్ల కోతి కోసం ఐకియా ఒరంగుటాన్ కోతి బొమ్మను అందించారు. ఈ పిల్ల కోతి ఆ బొమ్మను గట్టిగా హగ్ చేసుకుని, ఎంతో అప్యాయంగా చూసుకుంటుంది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ప్లష్ అంటే ఏమిటి?

ప్లష్ అంటే మృదువైన బొమ్మ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ఈ బొమ్మ కోసం నెటిజన్లు ఆన్ లైన్ లో, ఐకియా స్టోర్లలో బాగా వెతుకుతున్నారు. జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇచికావా సిటీ జూలోని మకాక్ పంచ్ పిల్ల కోతి కోసం జూ సిబ్బంది స్టఫ్డ్ ఒరంగుటాన్‌ బొమ్మను అందించారు. ఈ పిల్లకోతి పంచ్ బొమ్మపై చూపుతున్న ప్రేమ, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ మోడల్ కోతి బొమ్మ కోసం ఆన్లైన్ లో వెదుకుతున్నారు.

పుట్టిన వెంటనే…

Advertisement

జులై 2025లో పుట్టిన కొద్దిసేపటికే పిల్ల కోతిని దాని తల్లి వదిలిపెట్టింది. జూ సంరక్షకులు.. కోతి పిల్ల ఒంటరితనాన్ని తట్టుకోవడానికి సహాయపడే మార్గాలను ఆన్వేషించారు. దీనికి పంచ్-కున్ అనే పేరును పెట్టారు. అతి తక్కువ కాలంలోనే పంచ్ కోతి.. బొమ్మతో అనుబంధాన్ని ఏర్పరుచుకుంది. జూ అధికారుల ప్రకారం, పంచ్ మొదట్లో ఇతర కోతులతో కలిసి ఉండటానికి ఇబ్బంది పడింది. ఒంటరిగా ఉన్నట్లు కనిపించింది.

ఒరంగుటాన్ ప్లష్ చిన్న కోతులు. సాధారణంగా ఇవి తమ తల్లి నుంచి శారీరక ఆకారాన్ని, రంగును పొందుతాయి. జీవితానికి నెమ్మదిగా అలవాటు పడుతూ ఈ బొమ్మకు అతుక్కుపోయేలా, ఆడుకునేలా, నిద్రపోయేలా చేసింది. బొమ్మను కౌగిలించుకున్న చిన్న కోతి చిత్రాలు త్వరగా ఆన్‌లైన్‌లో వ్యాపించాయి, ప్రజల సానుభూతిని పొందింది. జూలో టూరిస్టుల సంఖ్య కూడా పెరిగింది.

ఐకియా అభివృద్ధి

Advertisement

స్కాండినేవియన్ ఫర్నిచర్ స్టోర్ అయిన ఐకియా.. ఈ వారం ప్రారంభంలో జపాన్‌లోని ఇచికావా సిటీ జూకు ఈ బొమ్మలను విరాళంగా అందిస్తున్నారు.  వైరల్‌గా మారిన పంచ్ అనే పిల్ల మకాక్ కోతి, IKEA జుంగెల్స్‌కాగ్ లాగా కనిపించే స్టఫ్డ్ ఒరంగుటాన్ పట్ల తన ప్రేమతో హృదయాలను తాకింది . పుట్టినప్పుడు తన తల్లి వదిలివేసిన పంచ్, ప్లష్‌ బొమ్మతో కలిసి జీవిస్తుంది.

Also Read:  ఇలాంటి వీడియోలు రేర్.. మొసలి దాడి నుంచి కోతిని కాపాడిన వానర సైన్యం.. ఇది కదా ఐక్యమత్యం అంటే…

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×