Om Shanthi Shanti Shantihi OTT: ఈ మధ్యకాలంలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), ఈషా రెబ్బా (Eesha Rebba) జంట గురించి ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనేలా టాక్ నడుస్తుంది. ఇక వెండితెరపై తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంట మెరిసిన హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanthi Shanti Shantihi). థియేటర్లలో ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఎన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని ఆహా (Aha) సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు AR సజీవ్ తెరకెక్కించిన ఈ సినిమా, మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. విశేషం ఏంటంటే, ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే అంటే మార్చి 3 నుంచే ఈ ఫన్ రైడ్‌ని ఎంజాయ్ చేయవచ్చని సదరు ఓటీటీ ప్రకటించింది.
Also Read- Ustaad Bhagat Singh: పవన్ కు విలన్ గా మల్లారెడ్డి .. అందుకే తీసుకోలేదన్న హరీష్ శంకర్!
ముఖ్యంగా పెళ్లి నేపథ్యం, కుటుంబ విలువల చుట్టూ తిరిగే ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించాయి. తరుణ్ భాస్కర్ మార్క్ మేనరిజమ్స్, ఈషా రెబ్బా చార్మింగ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించిన ఈ చిత్రానికి కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ చిత్రమని ఆహా ఓటీటీ ప్రచారం చేస్తోంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లకు, మరోసారి చూడాలనుకునే వాళ్లకు ఈ మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మరి థియేటర్లలో సక్సెస్ కాలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో చూద్దాం.
‘ఓం శాంతి శాంతి శాంతిః’ కథ విషయానికి వస్తే.. ప్రశాంతి (ఈషా రెబ్బా) కథ ఇది. చిన్నప్పటి సంది ఇంట్ల వాళ్లు ఏది చెబితే అదే పని. ఆటలు, చదువులు అన్నీ గాలికొదిలేసి వాళ్లు చెప్పినట్టే వింటది. కనీసం పెళ్లయినంకనన్న తన మొగుడు తనను అర్థం చేసుకుంటాడని ఆశపడ్తది. కానీ, ఆమెకు తగిలిన మొగుడు ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) పక్కా మెయిల్ షావనిస్ట్ గాడు. ముక్కు మీదే కోపం. పెళ్లాం అంటే కాలి కింద చెప్పు లెక్క చూస్తడు. చిన్న విషయానికే చేయి చేసుకోవడం అతగానికి అలవాటు. ఇక ఇట్లా కాదని మన ప్రశాంతి ఫిక్స్ అయి.. తన మొగుడికి అతని స్టైల్‌లోనే ఎట్లా బుద్ధి చెప్పింది? ఆ గొడవలో వాళ్ల సంసారం ఏమైంది? అనేదే ఈ సినిమా ముచ్చట.
Also Read- Vijay Rashmika: రష్మిక, విజయ్ పెళ్లి సంబరాలు మొదలు.. ఫ్యామిలీతో సహా ఉదయపూర్ చేరుకున్న జంట