E-Paper
Advertisement

LPG Weight: సిలిండర్ బరువు 14.2 కేజీలే ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు!

LPG Weight: సిలిండర్ బరువు 14.2 కేజీలే ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు!
Advertisement

LPG Weight: గృహోపకరణ అవసరాలకు వినియోగించే సిలిండర్ బరువు సరిగ్గా 14.2 కేజీలు ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. అయితే 14.2 బదులు రౌండ్ ఫిగర్ గా 14 లేదా 15 ఎందుకు లేదన్న అనుమానం చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే ఏదో ఏమరుపాటుగా గ్యాస్ సిలిండర్ కు 14.2 బరువును నిర్దేశించలేదని నిపుణులు అంటున్నారు. దీనికి మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.

వినియోగదారుల భద్రత

సాధారణంగా గ్యాస్ సిలిండర్లలో ఒత్తిడి (Pressure) చాలా ఎక్కువగా ఉంటుంది. సిలిండర్ పరిమాణం, దానిలో నింపే గ్యాస్ బరువు మధ్య సరైన సమతుల్యత తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సిలిండర్ ఉండే బరువుకు తోడు అందులో నింపాల్సిన గ్యాస్ పరిమితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 14.2 kg అనేది సురక్షితమైనదిగా నిర్ణయించారు. ముఖ్యంగా ఇళ్లల్లో వాడేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, సిలిండర్ పేలిపోకుండా ఉండేలా శాస్త్రీయంగా లెక్కించి ఈ నెంబర్ ను ఫిక్స్ చేశారు. 1950 నుంచి భారత్ లో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుండటం విశేషం.

సులభంగా తరలించడం

Advertisement

సాధారణంగా డొమెస్టిక్ సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీలు ఇళ్లకు సరఫరా చేస్తుంటాయి. డెలివరీ బాయ్స్ ద్వారా వాటిని సామాన్యులకు అందిస్తుంటాయి. అయితే గ్యాస్ బరువురు మరీ ఎక్కువగా ఉంటే డెలివరీ బాయ్ దానిని తీసుకెళ్లడం చాలా కష్టం. వారి ఆరోగ్యాన్ని సైతం దృష్టిలో ఉంచుకొని గ్యాస్ బరువును నిర్ణయించారన్న ప్రచారం కూడా ఉంది. 14.2 kg గ్యాస్ + ఖాళీ సిలిండర్ బరువు (సుమారు 15 kg) కలిపితే మొత్తం బరువు దాదాపు 29.2 కేజీల నుండి 30 కేజీల వరకు ఉంటుంది. సగటున ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి.. ఈ బరువును ఎలాంటి ఇబ్బంది లేకుండా మోయగలుగుతారు.

Also Read: Dishwasher Tips: డిష్ వాషర్ ఖర్చు వేధిస్తోందా? టెన్షన్ వద్దు మామ.. ఈ పంచసూత్రాలు ఫాలో అయిపోండి!

అంతర్జాతీయ ప్రమాణాలు

Advertisement

గతంలో మన దేశంలో గ్యాస్ కొలతలను ‘పౌండ్ల’ (Pounds)లో లెక్కించేవారు. బ్రిటీష్ కాలం నాటి లెక్కల ప్రకారం.. ఒక సిలిండర్‌లో 31.3 పౌండ్ల గ్యాస్‌ను నింపేవారు. దీనిని కిలోగ్రాముల్లోకి మారిస్తే అది సరిగ్గా 14.2 kg అవుతుంది. అప్పటి నుండి అదే ప్రామాణికంగా మారిపోయిందని కూడా నిపుణులు చెబుతుంటారు. ఇదిలా ఉంటే 14.2 కేజీలు ఉన్న డొమెస్టిక్ సిలిండర్.. సగటున ఒక కుటుంబానికి 30-45 రోజుల పాటు వంట అవసరాలను తీరుస్తుంది.

Also Read: Dishwasher Monthly Cost: డిష్ వాషర్ వాడితే.. నెలకు అయ్యే ఖర్చు ఎంత? ఇది తెలుసుకోండి ఫస్ట్!

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×