E-Paper
Advertisement

Dishwasher Monthly Cost: డిష్ వాషర్ వాడితే.. నెలకు అయ్యే ఖర్చు ఎంత? ఇది తెలుసుకోండి ఫస్ట్!

Dishwasher Monthly Cost: డిష్ వాషర్ వాడితే.. నెలకు అయ్యే ఖర్చు ఎంత? ఇది తెలుసుకోండి ఫస్ట్!
Advertisement

Dishwasher Monthly Cost: వంటింట్లో అతి కష్టమైన పని ఏది అనగానే ఠక్కున గుర్తుకువచ్చేది అంట్లో తోమడం లేదా గిన్నెలు కడగటం. నిత్యం సింక్ లో వచ్చిపడే గిన్నెలు కడిగేందుకు మహిళ పెద్ద ఎత్తున శ్రమిస్తుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రస్తుతం చాలా రకాల డిష్ వాషర్లు మార్కెట్ లోకి వచ్చాయి. అయితే దీనిని కొనుగోలు చేయడం వల్ల.. ప్రతీనెల ఎంత ఖర్చు అవుతుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ కన్ఫ్యూజన్ ను ఈ కథనంలో నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం.

విద్యుత్ వినియోగం (Power Consumption)

డిష్‌వాషర్‌లు సాధారణంగా ఒకసారి వాడినప్పుడు 0.8 నుండి 1.2 యూనిట్ల (kWh) విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఇది మీరు ఎంచుకునే ఎకో మోడ్ (Eco Mode), ఇంటెన్సివ్ (Intensive), క్విక్ వాష్ (Quick Wash) పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వేడి నీటితో గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు సహజంగానే కొంచెం ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. సగటున ఒక యూనిట్ ధర రూ.7 -10 వరకు అనుకుంటే, ప్రతి వాష్‌కి సుమారు రూ.6 నుండి రూ.12 వరకు ఖర్చవుతుంది.

నీటి వినియోగం (Water Consumption)

Advertisement

చేత్తో గిన్నెలు కడగడం కంటే డిష్‌వాషర్ వాడటం వల్ల నీరు చాలా ఆదా అవుతుంది. ఆధునిక డిష్‌వాషర్‌లు.. ఒక సైకిల్‌కు కేవలం 9 నుండి 12 లీటర్ల నీటిని మాత్రమే ఉపయోగిస్తాయి. అదే పనిని చేత్తో చేస్తే సుమారు 50 నుండి 60 లీటర్ల నీరు అవసరమవుతుంది. కాబట్టి వాటర్ బిల్లు పరంగా.. డిష్ వాషర్లు చాలా పొదుపైనవిగా చెప్పవచ్చు.

డిటర్జెంట్, సాల్ట్ ఖర్చు (Detergent and Salt Cost)

డిష్‌వాషర్ మెరుగ్గా పనిచేయడానికి డిటర్జెట్, సాల్ట్, రిన్స్ ఎయిడ్ అనే మూడు రకాల పదార్థాలు తప్పనిసరి. డిటర్జెంట్ (Detergent)అనేది.. పౌడర్ లేదా టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఒక వాష్‌కి సుమారు రూ.10 నుండి రూ.15 ఖర్చవుతుంది. మరోవైపు నీటిలోని కఠినత్వాన్ని తగ్గించడానికి సాల్ట్ వాడతారు. నెలకు సుమారు రూ.100 నుండి రూ.150 వరకు దీనికి ఖర్చవుతుంది. ఇక రిన్స్ ఎయిడ్ (Rinse Aid) విషయానికి వస్తే.. ఇది గిన్నెలు త్వరగా ఆరిపోవడానికి, మెరవడానికి తోడ్పడుతుంది. మెుత్తంగా గిన్నెలు కడిగే కెమికల్స్ కోసం ప్రతి వాష్‌కి సుమారు రూ.15 -20 వరకు ఖర్చవుతుంది.

Advertisement

Also Read: Upcoming ACs April 2026: కొత్త ఏసీ కావాలా? రుకో జరా, సబర్ కరో.. ఏప్రిల్‌లో వచ్చే టాప్ మోడల్స్ ఇవే!

నెలవారీ ఖర్చు ఎంత?

మీరు రోజుకు ఒకసారి డిష్‌వాషర్ ఉపయోగిస్తున్నారని అనుకుంటే నెలవారిగా విద్యుత్ ఖర్చు రూ.250-350 వరకూ రావొచ్చు. నీటికి అయితే మున్సిపాలిటీ నీటి ధరల ప్రకారం.. రూ.20-50 ఖర్చు కావొచ్చు. డిటర్జెంట్, సాల్ట్ విషయానికి వస్తే రూ. 450 – 600 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే డిష్ వాషర్ వినియోగం వల్ల నెలకు రూ. రూ.700 నుండి రూ.900 వరకు ఖర్చయ్యే ఛాన్స్ ఉంది. ఇది మధ్యతరగతి వారికి కాస్త ఆర్థికభారంగా మారే అవకాశముంది. కాబట్టి డిష్ వాషర్ కొనుగోలు చేసేముందు.. నెలవారి ఖర్చును కూడా పరిగణలోకి తీసుకుంటే బెటరని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యగమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు ఎంచుకునే బ్రాండ్, మీరు ఉండే ప్రాంతంలోని విద్యుత్ ధరలను బట్టి ఈ ఖర్చుల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Also Read: Induction Stove Offers: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్.. తక్కువ ధరకే ఇండక్షన్ స్టవ్స్‌.. మరీ ఇంత తగ్గించారేంట్రా!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×