E-Paper
Advertisement

Ticket Cancellation Rules: రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్.. ఫుల్ రీఫండ్ రావాలంటే?

Ticket Cancellation Rules: రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్.. ఫుల్ రీఫండ్ రావాలంటే?
Advertisement

Indian Railway Ticket Cancellation Rules: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసే సమయాన్ని బట్టి  రిఫండ్ లభిస్తుంది. ఇంతకీ ఫుల్ రీఫండ్ రావాలంటే ఏం చేయాలి? ప్రయాణానికి ఎంత ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. ఎంత రీఫండ్ వస్తుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ 72 గంటల ముందే క్యాన్సిల్ చేస్తే పూర్తి రిఫండ్

Advertisement

రైలు బయలుదేరే సమయానికి కనీసం 72 గంటల ముందే టికెట్‌ను రద్దు చేస్తే, దాదాపు పూర్తి రిఫండ్ పొందవచ్చు. తక్కువ మొత్తంలో క్యాన్సిలేషన్ ఛార్జీలు తీసుకుంటారు. అంటే, ముందుగానే ప్లాన్ మార్చుకున్న వారికి ఈ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంటే, వెంటనే క్యాన్సిల్ చేయడం మంచిది.

⦿ 72 నుంచి 24 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 75% రిఫండ్

రైలు బయలుదేరే సమయానికి 72 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్ రద్దు చేస్తే, సుమారు 75 శాతం వరకు రిఫండ్ లభిస్తుంది. ఈ సమయంలో కొంత ఎక్కువ క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. అయినప్పటికీ, చివరి నిమిషంలో కాకుండా కొంత ముందే రద్దు చేస్తే ఎక్కువ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.

⦿ 24 నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% రిఫండ్

Advertisement

రైలు బయలుదేరే సమయానికి 24 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్‌ను రద్దు చేస్తే, కేవలం 50 శాతం మాత్రమే రిఫండ్ అందుతుంది. ఇది ప్రయాణానికి దగ్గరగా ఉండే సమయం కాబట్టి, రైల్వేకు సీటును మళ్లీ కేటాయించడం కష్టమవుతుంది. అందుకే రిఫండ్ శాతం తగ్గించబడుతుంది.

టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ లో మార్పులు ఎందుకు?     

రైల్వే తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రధాన కారణం ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకునేలా చేయడం. ముందుగానే క్యాన్సిల్ చేస్తే ఎక్కువ రిఫండ్ వస్తుంది. ఆలస్యంగా చేస్తే తక్కువ వస్తుంది. దీని వల్ల రైల్వేకు కూడా ఖాళీ సీట్లు తగ్గి, ఇతర ప్రయాణికులకు అవకాశం లభిస్తుంది.

Read Also: రంగు రంగుల రైళ్లు.. ఒక్కో కలర్ వెనక ఒక్కో కథ!

ప్రయాణికులు ఏం చేయాలంటే?

టికెట్ బుక్ చేసుకున్న వెంటనే ప్రయాణం కచ్చితమా? కాదా? అన్నది ఒకసారి పరిశీలించాలి. ప్లాన్ మారే అవకాశం ఉంటే.. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే క్యాన్సిల్ చేయడం మంచిది. ఇలా చేస్తే డబ్బు మొత్తాన్ని తిరిగిపొందే అవకాశం ఉంటుంది. ఈ కొత్త రూల్స్ ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యేలా ఉండటమే కాకుండా, ప్రయాణాన్ని మరింత ప్లాన్ చేయడానికి ఉపయోగపడతాయి. సరైన సమయంలో టికెట్ క్యాన్సిల్ చేస్తే, మంచి రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది.

Read Also:  ప్రయాణీకులకు టీ ఇవ్వని సిబ్బంది.. IRCTC షాకింగ్ డెసిషన్!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×