E-Paper
Advertisement

Gold Rates: ఫ్యూచర్‌లో బంగారం ధర పెరుగుతుందా.. తగ్గుతుందా..?

Gold Rates: ఫ్యూచర్‌లో బంగారం ధర పెరుగుతుందా.. తగ్గుతుందా..?
Advertisement

Gold Rates: దేశంలో బంగారం అమాంతంపెరుగుతోంది. అనాహ్యమైన పెరుగుదల బంగారంలో ఉండడం ఇప్పుడు అందరిని ఆలోపింపజేస్తుంది. గడిచిన జులై నెలలో తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు ఎందుకు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయి. దీనీకి కారణం ఏంటని.. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. బంగారం ధరలు పెరిగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది “డీ డాలరైజేషన్” అని నిపుణులు చెబుతున్నారు. డాలర్‌కు పోటీగా ఇతర కరెన్సీలను ముందుకునెట్టేసే దానికోసం అనేక దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో చైనా, బ్రెజిల్, రష్యా, సౌతాఫ్రికా మొదలైన దేశాలు వేగవంతంగా కృషిచేస్తున్నాయి.

దీంతో డాలర్‌ని రిజర్వ్ కరెన్సీగా తమ దేశాలలో నిల్వ చేసుకున్న అనేక మంది ఇప్పుడు డాలర్‌కి ప్రత్యామ్నాయంగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం పెంచుకోవ‌డానికి ప్రయత్నం చేస్తున్నారు. డాలర్‌ని తిరిగి మార్కెట్లో అమ్మకాలు పెట్టేసి దాని బదులుగా బంగారాన్ని దాచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే ఇప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరగడానికి కారణం ఇదేనని  స్టాక్ మార్కెట్లు చెబుతున్నాయి. గత ఏడాదిలో చూస్తే.. అక్టోబర్, నవంబర్ నెలల్లో చూస్తే.. దాదాపు పది గ్రాములు బంగారం ధర(Gold Rates) రూ. 63,000 ఉంది. అదే ఈరోజు చూస్తే రూ. 79, 420 ఉంది. అంటే ఏడాదిలోనే ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరే చూడండి. 63 నుంచి, 80వేలకు పెరిగిన బంగారం ధర చూస్తుంటే.. ఆసక్తి రేకిత్తిస్తోంది.

Advertisement

ఇలా పెరిగిపోవడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు. మార్కెట్లో రిజర్వ్ కరెన్సీ విషయంలో జరుగుతున్న పెనుమార్పులే ఇందుకు కారణం ఇని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఒక కారణం అయితే.. మరికొటి పండుగల సమయం.. పైగా కార్తీక మాసం వస్తుంది. పెళ్లిళ్ల సీజన్.. ఇక బంగారం కొనుగోలు చేసే వారు ఎక్కువే. రాబోయే రోజుల్లో లెక్షకు పైగా బంగారం పెరగవచ్చని స్టాక్ మార్కెట్లు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం రేటు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం. గత వారం నుంచి పరిశీలిస్తే.. కాస్త బంగారం ధర  తగ్గినట్టే  ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం పసిడి ధర(Gold Rates) రూ. 79, 470 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rates) 72, 850 ఉంది.

Also Read: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Advertisement

బంగారం ధరలు

బంగారం రేటు ఎక్కడ తగ్గిన రాజధాని అయిన ఢిల్లీలో మాత్రం బంగారం ధర(Gold Rates) తగ్గేదేలే అనేలా ఉంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rates) రూ.79, 610 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 72, 990 ఉంది.

ముంబైలో బంగారం ధరలు పరశీలిస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rates) 79, 460 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rates) రూ. 72, 840 ఉంది.

చెన్నైలో గోల్డ్ర్ రేట్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర 79, 460 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 72,840 ఉంది.

బెంగుళూరులో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం పసిడి ధర 79, 460 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 72, 840 ఉంది.

ఏపీ, తెలంగాణలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం పసిడి ధర 79, 460 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 72,840 ఉంది.

విజయవాడలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం పసిడి ధర 79, 460 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 72,840 ఉంది.

విశాఖ పట్నంలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం పసిడి ధర 79, 460 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 72,840 ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
చెన్నైలో కిలో వెండి ధర 1,09,900 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీలో వెండి ధరలు 1, 01, 000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి దర 1, 01, 000 ఉంది.

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×