BigTV English

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

TDP vs YCP: ఏపీలో రాజకీయాలు రంజుగా మారాయి. జస్ట్ ఒక్క ఛాన్స్ దొరికితే చాలు.. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు.. విమర్శల దాడికి దిగుతున్నాయి. ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారం తెరమీదికి వచ్చిన సమయం నుండి టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం ఓ వైపు, ట్వీట్ ల వర్షం మరో వైపు సాగుతోంది. అయితే తాజాగా టీడీపీ ఎక్స్ ఖాతా నుండి, మాజీ సీఎం వైయస్ జగన్ కు శుభాకంక్షలు తెలిపారు. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే వీరి మధ్య శుభాకాంక్షలు చెప్పుకోవడం ఏమిటనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చూడాల్సిందే.


మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ ఆస్తులకు సంబంధించి ఇటీవల టీడీపీ సోషల్ మీడియా రాజకీయ దుమారం లేపే ట్వీట్లను వరుసగా పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ రాసిన లేఖను, టీడీపీ సోషల్ మీడియా నుండి బయటకు రావడంతో మాజీ సీఎం జగన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి ఫ్యామిలీలో ఉండే సమస్యలు, తమ ఫ్యామిలీలో కూడా ఉన్నాయని, వాటి గురించి పదేపదే మీడియా ద్వారా చూపించడం బదులు, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని టీడీపీకి జగన్ సూచించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, సూపర్ సిక్స్ పథకాల అమలకు బదులు తన తల్లి, చెల్లి ఫోటోలను చూపిస్తూ టీడీపీ అనుకూల మీడియా ఆనంద పడుతుందని, ప్రజా సమస్యలు ఎవరికీ పట్టని రీతిలో ఏపీలో పరిపాలన సాగుతుందని విమర్శించారు.


Also Read: YS Jagan: మా ఇంటి వైపు తొంగి చూడొద్దు.. అన్ని కుటుంబాలలో ఉండేదేగా.. ఆస్తి వివాదంపై జగన్ స్పందన

అయితే తాజాగా టీడీపీ ఎక్స్ ఖాతా నుండి పోస్ట్ చేసిన ట్వీట్.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ కు హ్యాపీ కోడి కత్తి డే అంటూ శుభాకాంక్షలు తెలపడంపై వైసీపీ సోషల్ మీడియా భగ్గుమంది. అలాగే 6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టండి జగన్ అంటూ పోస్ట్ చేశారు.

కాగా గతంలో జగన్ పై విశాఖ విమానాశ్రయం వద్ద కోడి కత్తితో దాడి జరగగా, నేటికీ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ సోషల్ మీడియా ఈ పోస్ట్ చేసిందని భావించవచ్చు. అంతేకాకుండా నాటి జగన్ పై దాడి జరిగిన ఫోటోలను సైతం పోస్ట్ చేసి, దళిత యువకుడు శ్రీను జీవితాన్ని నిలబెట్టాలని సూచించింది. అసలే టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ ల విమర్శలు సాగుతుండగా.. ఈ ట్వీట్ పై వైసీపీ సోషల్ మీడియా కూడా వెరైటీగా రిప్లై ఇచ్చింది. వైసీపీ ట్వీట్ లో ఏముందంటే.. ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా.. మన రాష్ట్రంలో కోడికత్తి లాంటి పదునైన ఆయుధంతో ఎవరిపైనైనా దాడిచేసినా అది నేరం కాదని అధికారపార్టీ ప్రకటించిందండోయ్‌. ఆ దాడికారణంగా గాయమైనా, చికిత్సకోసం ఆస్పత్రిలో చేరినా.. దాన్ని పెద్దనేరంగా చూడాల్సిన అవసరంలేదని స్వయంగా పార్టీ ప్రకటించిందండోయ్‌ అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది. ఏపీనా మజాకా.. పొలిటికల్ పీక్స్.. ట్వీట్స్ కిరాక్స్ అంటున్నారు నెటిజన్లు.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×