E-Paper
Advertisement

Gold Rate: బంగారం ధర లక్షకు పడిపోతాయా? అది ఎలా సాధ్యం?

Gold Rate: బంగారం ధర లక్షకు పడిపోతాయా? అది ఎలా సాధ్యం?

భారతదేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక ఎమోషన్,ఒక పెట్టుబడి.పెళ్లిళ్లు, పండుగలు.. ఇలా ఎన్నో కారణాలతో భారతీయులు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లు చాలా వరకు తగ్గిపోయాయి. 2026లో బంగారం ధరలు తగ్గి రూ.1 లక్షకి చేరుతాయనే ఆశ ఎంతో మందిలో కనిపిస్తోంది. గత కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుదల దిశలోనే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, యుద్ధ ఉద్రిక్తతలు వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని విపరీతంగా కొంటున్నారు. చివరికి బ్యాంకులు కూడా బంగారాన్ని కొనిపెట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడం చాలా అరుదుగా జరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ బలంగా ఉండటం వల్ల పెద్దగా పతనం సంభవించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

లక్షకు పడిపోతుందా?
కొంతమంది బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు రూ.1 లక్షకు పడిపోవడం సాధ్యపడదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. డాలర్ మారకపు విలువల్లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశాలన్నీ బంగారం ధరలు పెరిగేందుకు మద్దతు ఇస్తున్నాయి. ఇంకెప్పుడు బంగారం ధరలు తగ్గాలి.

Also read: Black Coffee: బ్లాక్ కాఫీతో పాటూ ఇవి తిన్నారంటే బరువు త్వరగా తగ్గిపోవచ్చు

డాలర్ బలపడితే
బంగారం ధరలు కేవలం దేశీయ మార్కెట్‌పై మాత్రమే ఆధారపడవు. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలం, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ బలపడితే బంగారం ధరలు కొంత ఒత్తిడికి గురవుతాయి. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెరిగితే పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల ధరలు పూర్తిగా పడిపోవడం కష్టం.

భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటి. పెళ్లిళ్లు, పండుగలు, ఆభరణాల సంస్కృతి కారణంగా దేశీయ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ, దసరా, దీపావళి వంటి సందర్భాల్లో కొనుగోళ్లు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరగడం కూడా బంగారం కొనుగోళ్లను ప్రభావితం చేస్తోంది. వ్యవసాయ ఆదాయం మెరుగుపడితే బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ కారణంగా దేశీయ డిమాండ్ ధరలను స్థిరంగా ఉంచే అంశంగా మారింది.

బంగారం కొనుగోలు విషయంలో మార్కెట్ టైమింగ్ కంటే దీర్ఘకాల దృష్టి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు తాత్కాలికంగా తగ్గినా లేదా పెరిగినా, దీర్ఘకాలంలో బంగారం విలువ పెరుగుతుందని అనుభవం చెబుతోంది. కాబట్టి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనకుండా చిన్న చిన్నగా కొనుగోలు చేయండి. ఆభరణాల కంటే పెట్టుబడి కోసం డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలను పరిశీలించండి. కుటుంబ అవసరాలు, పెట్టుబడి లక్ష్యాన్ని ముందే నిర్ణయించుకోండి.

2026లో బంగారం ధరలు రూ.1 లక్షకు పడిపోతాయని ఎక్కడా సంకేతాలు కనిపించడం. కొంతమంది విశ్లేషకులు దీర్ఘకాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసం బంగారం మీద కొనసాగుతుండటం దీనికి కారణం.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×