Kavitha: ఒకే నియోజకవర్గ నుంచి భావ మరదలు పోటీ చేయబోతున్నారు. సిద్దిపేట నియోజకవర్గ హరీష్ రావుకు కంచుకోట. ఆ కోట నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేయబోతున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి కమిటీలు వేయనున్నట్లు సమాచారం. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరి ఇరువురి పోటీ హాట్ టాపిక్ గా మారనుంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో రసవత్తరంగా మారనున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటు కోసం ప్రక్రియను స్టార్ట్ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రకటించబోయే పార్టీలో మదర్ బోర్డు తెలంగాణ ఉంటుందని కవిత ప్రకటించారు. అయితే పార్టీ పేరు ఏముంటుందనేది ఇప్పటికే రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోను విస్తృత చర్చ జరుగుతుంది. తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీ ప్రకటన ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.
ఇది ఇలా ఉంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పోటీకి ఇప్పటినుంచే ఆయా నియోజకవర్గాలపై ఆరా తీసిన కవిత.. సిద్దిపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆమె చిచ్చాట్లో వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత హరీష్ రావు టార్గెట్గా విమర్శనాస్త్రాలు సందిస్తుంది. దీనికి తోడు ఆయన కంచుకోట ఆయన సిద్దిపేట నుంచి పోటీ చేయబోతున్నట్లు కవిత తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ఎప్పుడు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతుంది. ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు… నిజంగానే పోటీ చేస్తారా లేకుంటే చర్చ జరిగేందుకే సిద్దిపేట నుంచి పోటీ అని ప్రకటన చేశారా అనేది హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ ఎస్ పార్టీలో హరీష్ రావు కీలక నేత. ట్రబుల్ షూటర్ గా పేరు ఉంది. ఆయనకు పార్టీ అధినేత కేసిఆర్ ఏ బాధ్యతలు అప్పగించిన విజయవంతం చేస్తారని నానుడి ఉంది. అంతేకాదు ఆయనకు మాస్ పీపుల్ లోను ఆదరణ ఉంది. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆయనకు బలమైన అనుచర గణంతోపాటు క్యాడర్ సైతం పటిష్టంగా ఉంది. హరీష్ రావు సిద్దిపేటలో ఓడించాలంటే ఆయన కంటే బలమైన కేడర్ను గ్రామస్థాయి నుంచి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కవిత సిద్దిపేట నుంచి పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాడంట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పోటీ చేసి గెలుస్తుందా అనేది కూడా చర్చకు దారి తీసింది. సిద్దిపేట తో పాటు బోధన్ నియోజకవర్గం సైతం పోటీ చేసేందుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కవిత ఇప్పటికే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పొత్తుతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. 30 డివిజన్లు వార్డుల్లో విజయం సాధించింది. అంతేకాదు వడ్డేపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు. ఇది కవితకు జాగృతికి ఏఐఎఫ్బి పార్టీకి సైతం భరోసా కల్పించింది. క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఉత్సాహంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సలహాలు చేస్తుంది. మరోవైపు పార్టీ రిజిస్ట్రేషన్ తో పాటు ప్రకటనకు మంచి ముహూర్తాలు చూస్తుంది. మే మొదటి వారంలో పార్టీ ప్రకటన ఉంటుందని కవిత ప్రకటించారు. తెలంగాణ నే తమ పార్టీ మదర్ బోర్డ్ అని వెల్లడించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఫోకస్ పెట్టాలనే దానిపై కవిత ప్రత్యేకంగా ఆరాధిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం తామేనని, ప్రజల సమస్యలను బలంగా లేవనెత్తుతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో తామే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణలో బీజేపీ అనేది క్రమంగా కనుమరుగు అవుతుందని ఆమె అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ కలిసి పోటీ చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి తమ పార్టీ గుర్తు వచ్చే అవకాశం ఉందని, తమ పార్టీ గుర్తుపైనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అయితే యువతకు పెద్దపీట వేస్తామన్నారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 50 కమిటీలు వేశామని వాటి ద్వారా అనేక చర్చలు చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీలో చేరేందుకు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఆసక్తితో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది తనతో టచ్ లో ఉన్నారని సందర్భం వచ్చినప్పుడు వివరాలు చెబుతానన్నారు.
పార్టీ పెట్టి ఫెయిల్ అయిన మగ నాయకుల గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. షర్మిల ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని చాలా మంది తప్పుబట్టారని, ఆమె ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలని గుర్తు చేశారు. ఆడవాళ్ల ఫెయిల్యూర్స్ మాత్రమే పెద్దగా చేసి చూపించడం సరికాదని అన్నారు. చిరంజీవి, దేవేందర్ గౌడ్ ఏ ఒక్కరూ ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతా అని బీజేపీలో చేరారు తర్వాత కాంగ్రెస్ లో చేరారని.. ఇప్పుడు మళ్లీ పార్టీ పెడతా అంటున్నారని తెలిపారు. ఆయన గురించి కూడా ఎవరు మాట్లాడారని.. మహిళలను మాత్రం తక్కువ చేసి చూస్తారని అన్నారు. ప్రజల కోణంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీయేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Hyderabad Terror Plot: హైదరాబాద్‌లో మళ్ళీ ఉగ్ర నీడలు.. జైలు గోడల మధ్యే పాకిస్థాన్‌కు కాల్స్?