E-Paper
Advertisement

Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఆ కంపెనీలకు దీటుగా..!

Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఆ కంపెనీలకు దీటుగా..!
Advertisement

Yamaha New Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది. అదే క్రమంలో ఓలాతో పోటీ పడేందుకు ఇతర తయారీదారులు తెగ కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ బ్రాండ్ యమహా.. జపాన్, భారతదేశం కోసం ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి తాజాగా కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..

యమహా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. భారతదేశంలో ఇంకా యమహా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అమ్మకానికి లేదు. ఈ క్రమంలోనే యమహా భారతదేశంలో అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

యమహా నుండి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు సహా ఇతర లక్షణాలపై దృష్టి సారించింది. అందుతున్న సమాచారం ప్రకారం.. యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. యమహా భారతదేశంలో నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ మోడల్ ఇప్పటికే UK వంటి మార్కెట్‌లలో అందుబాటులో ఉంది.

Also Read: యమహ మజాకా.. దొంగిలించారో దొరికిపోతారు.. అలాంటిలాంటి స్కూటర్ కాదిది!

Advertisement

అయితే యమహా ఇండియా-బౌండ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మరే ఇతర మార్కెట్‌లోనూ విక్రయించబడని పూర్తిగా కొత్త మోడల్ కావచ్చని తాజా సమాచారం. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. కాగా ఇది భారతీయ రోడ్లపైకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఫోకస్ అంతా.. ప్రీమియం పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలపైనే ఉంది. 2030 నాటికి భారతీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు 20-30 శాతం వాటాను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

2030 నాటికి యమహా అనేక ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనుంది. భారతదేశంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని యమహా యోచిస్తోంది. అయితే దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎప్పుడు లాంచ్ చేయాలనే దానిపై క్లారిటీ లేదు.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×