BigTV English

Jaipur Fake Jewellery Sale: రూ. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మిన ఘనుడు.. మోసపోయిన అమెరికా మహిళ!

Jaipur Fake Jewellery Sale: రూ. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మిన ఘనుడు.. మోసపోయిన అమెరికా మహిళ!

Jaipur Fake Jewellery Sale: ఈమె అమెరికాకు చెందిన మహిళ. సోషల్ మీడియా ద్వారా ఈ మహిళకు ఇండియాలోని రాజస్థాన్ కు చెందిన ఓ నగల వ్యాపారి పరిచయమయ్యాడు. అతడిని నమ్మిన అమెరికా మహిళ.. ఇండియాకు వచ్చి అతడి వద్ద ఉన్న నగలను కొన్నది. అందుకు రూ. 6 కోట్లు చెల్లించింది. వాటిని తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లో విక్రయానికి పెట్టింది. ఇక్కడ అసలు విషయం బయటపడింది. ఆ నగలు బంగారం పూతతో పూసి ఉన్న వెండి ఆభరణాలని తెలిసింది. వాటి విలువ రూ. 300 ఉంటుందని గుర్తించారు. తాను మోసపోయానని గుర్తించిన ఆ మహిళ నేరుగా మళ్లీ రాజస్థాన్ వ్యాపారి వద్దకు వచ్చి ప్రశ్నించింది. అదేంలేదంటూ పైగా ఆ మహిళనే బుకాయించాడు.


దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడు తన తండ్రితో కలిసి పరారయ్యాడు. దీంతో పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..

అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ ఇండియాలోని జైపూర్ లోని జోహ్రీ బజార్ లో ఉన్న ఓ నగల వ్యాపారి నుంచి బంగారు పాలిష్ తో కూడిన వెండి ఆభరణాలను కొనుగోలు చేసింది. వాటికి రూ. 6 కోట్ల నగదును చెల్లింది. ఏప్రిల్ లో యూఎస్ లో జరిగిన ఎగ్జిబిషన్ లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. బంగారం పూత పూసి ఉన్నటువంటి వెండి ఆభరణాలుగా గుర్తించారు. వాటి విలువ రూ. 300 మాత్రమేనని తెలిసి ఆ మహిళ షాక్ కు గురైంది. వెంటనే ఆమె ఇండియాకు చేరుకుంది. ఆ తరువాత రాజస్థాన్ లోని జైపూర్ కు వచ్చి తనకు నకిలీ ఆభరణాలను విక్రయించిన వ్యాపారిని నిలదీసింది.


Also Read: విషాదం.. ఒడిశా సీఎం పీఏ మృతి

దీంతో ఆ వ్యాపారి… అదేంలేదంటూ ఆమె ఆరోపణలను కొట్టిపారేస్తూ బుకాయించ సాగాడు. వెంటనే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. విషయం తెలుసుకున్న అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా పోలీసులను కోరారు.

2022లో సోషల్ మీడియా ద్వారా నగల వ్యాపారితో పరిచయం ఏర్పడిందని, గత రెండేళ్లుగా నగల కోసం రూ. 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు వివరించింది. ప్రస్తుతం ఆ నగల వ్యాపారి, తన తండ్రితో కలిసి పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

Tags

Related News

Varshini Case: కన్నతల్లే హంతకురాలు.. వర్షిణి హత్య కేసులో సంచలన ట్విస్ట్!

Medchal News: గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆటో చెరువులో పడి తండ్రికొడుకులు మృతి

Eluru Nimajjanam: వినాయక నిమజ్జనంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం.. పగిలిన తలలు

Bus Road Incident: కంటైనర్‌‌ను ఢీ కొన్న ట్రావెల్స్‌ బస్సు.. స్పాట్‌లో నలుగురు మృతి!

Double Murder: డబుల్ మర్డర్‌.. భార్య, అత్తను కత్తెరతో హత్య చేసిన అల్లుడు!

Ganesh Festival Tragedy: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. పశ్చిమగోదావరి, అల్లూరిలో ఆరుగురు మృతి!

Big Stories

×