BigTV English

Income Source : ఇతరులతో చెప్పకూడదని 9 విషయాలు

Income Source : ఇతరులతో చెప్పకూడదని 9 విషయాలు
Income Source


Income Source : మన జీవితం పేరెంట్స్, కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సాగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఇంట్లో వాళ్లకి చెప్పకపోయినా స్నేహితులతో దగ్గరి వాళ్లకో చెప్పుకుంటాం. ఆనందం, బాధ ఏదైనా సరే కొంతమంద దగ్గరే షేర్ చేసుకుంటాం . అన్నీ విషయలు అందరి దగ్గర చెప్పకూడదంటారు. ముఖ్యంగా 9 విషయాలు మాత్రం అస్సలు చెప్పకూడదు. మనకి వచ్చే ఆదాయం గురించి ఎవరితోనే ఎప్పుడు షేర్ చేసుకోవద్దు . మన జీతం లేదా సంపాదన తెలిస్తే అవతలి వారు మనల్ని తక్కువగా చూడొచ్చు. చులకనగా కూడా మాట్లాడవచ్చు. అవతలి వారికి మనకన్నా ఎక్కువ సంపాదన ఉంటే మనపై ఏడుస్తారు.

భార్యాభర్తల మధ్య సవాలక్ష గొడవలు రావచ్చు. అయితే వాటిని మూడో వ్యక్తితో పంచుకోకూడదు. తల్లి బిడ్డల మధ్య విభేదాలు ఉన్నా వాటిని ఇతరులతో చెప్పకూడదు. అలాగే వయసు సంగతి కూడా ఎవరికి చెప్పకూడదు. రేషన్ కార్డు లేదా ఇతర పత్రాల్లో నింపే వరకు పర్వాలేదు కానీ..పని గట్టుకుని ఏజ్ సంగతి చెప్పద్దని మన పెద్దలు చెప్పారు . ఇతరులతో పంచుకో కూడని విషయాల్లో మరోటిది మంత్రం. కొన్ని కార్యక్రమాల్లో మంత్రాలను చెవిలో చెప్పడానికి కారణం ఇదే. అపాత్రదానం జరిగితే కలిగే నష్టం ఆ మంత్రోపదేశం చేసిన వారికి కూడా ఉంటుంది.


మనం చేసే దానాల సంగతి వేరేవారికి చెప్పకూడదు. దానం తీసుకున్న వ్యక్తి చెప్పినా పర్వాలేదు. దానం చేసి చెప్పుకుంటే దాని వల్ల ఎలాంటి ఫలితం ఆవ్యక్తికి కలగదని శాస్త్రం చెబుతోంది.భార్యాభర్తల సంగమానికి సంబంధించిన విషయాలు పంచుకోకూడదు. మనం జరిగే సన్మానాల గురించి ప్రత్యేకించి ఎవరికి గొప్పలు చెప్పకూడదంటారు పెద్దలు. మనకి ఎంత విద్య ఉన్నా మనల్ని మనం పొగుడుకోకూడదు. అలాగే మనకి జరిగే అవమానాలను కూడా అవతలి వారితో పంచుకుంటే మనపై చులకన భావం ఏర్పడుతుంది. మనం వాడే ఔషధాల గురించి ఇతరులతో చెప్పకూడదు.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×