Kantara Chapter 1 : రిషబ్ శెట్టి నటించిన కాంతర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగులో దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమాను అప్పుడు తెలుగులో విడుదల చేశారు.
కాంతారా చాప్టర్ 1 నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి విపరీతమైన అంచనాల ఉన్న సంగతి తెలిసిందే. వస్తున్న పాజిటివ్ రివ్యూస్ బట్టి అంచనాలను ఈ సినిమా కూడా అందుకుంది అని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.
ప్రస్తుతం చాలా థియేటర్స్ లో కాంతారా సినిమా ప్రదర్శించబడుతుంది. బెంగళూరు సిటీలోని అంజనా థియేటర్ వద్ద ఒక అనుకొని సంఘటన జరిగింది. కాంతారా సినిమా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి ఎలా అయితే దేవత పట్టిన వెంటనే పూనకాలతో ఊగిపోతాడో, అచ్చం అదే మాదిరిగా థియేటర్ బయట ఒక అభిమాని కూడా పూనకాలతో ఊగిపోయాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే జెన్యూన్ గా ఇతనికి దేవత పెట్టింది అని కొందరు అంటుంటే, అందరి అటెన్షన్ కోసమే నటిస్తున్నాడు అనేది కొందరి అభిప్రాయం. కానీ ఎక్కువ సందర్భాలలో దైవత్వానికి గురి అయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు వస్తాడు అని బలంగా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఎందుకు అని అడ్డంగా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు.
కాంతర సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ లభిస్తుంది. అలానే బుక్ మై షో లో కూడా టికెట్ సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సినిమాతో కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
కాంతారా షో కలకలం… థియేటర్ బయట పూనకాలతో కొట్టుకున్న ఫ్యాన్ వీడియో #KantaraChapter1 #Kantara #Kantara2 #RishabhShetty #RishabShettyRules #RukminiVasanth #BigtvCinema pic.twitter.com/vqMHe5AZRP
— BIG TV Cinema (@BigtvCinema) October 2, 2025
కాంతార అనేది దేవత కోసం సాంప్రదాయ నృత్యమైన భూత కోలా యొక్క దైవిక అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించడమే కాకుండా, కాంతార లో కూడా రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ నటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా రుక్మిణి వసంత నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాకి సంబంధించి కొన్ని వివాదాలు మొదలయ్యాయి. దీనికి కారణం తెలుగు ఈవెంట్లో రిషబ్ శెట్టి తెలుగు మాట్లాడకపోవడం. బహుశా ఇది కూడా రిషబ్ శెట్టి వరకు వెళ్లి ఉంటుంది. అందుకే విజయవాడ ఈవెంట్ లో కంప్లీట్ తెలుగు స్పీచ్ అందించాడు రిషబ్.
Also Read: Pawan Kalyan On Reviews : సినిమా స్టార్ట్ అయ్యేలోపే రివ్యూస్, మా ఉసురు తగులుతుంది!
You are on desktop!