ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ధోరణితో కొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని చిన్నచూపు చూస్తూ వారితో వివాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కన్నడ భాషా వివాదం తరచూ తెరపైకి వస్తోంది. గతంలో బ్యాంక్ మేనేజర్, కస్టమర్ మధ్య జరిగిన కన్నడ భాషా వివాదం ఒక ఉదాహరణ. తాజాగా, బెంగళూరులోని నమ్మా మెట్రో స్టేషన్‌లో ఇలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, భాషా వివాదాలపై మరోసారి చర్చను రేకెత్తించింది.
మెట్రో స్టేషన్‌లో కన్నడ భాషపై వాగ్వాదం
నమ్మా మెట్రో స్టేషన్‌లో ఇద్దరు మహిళల మధ్య కన్నడ భాషపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక మహిళ కన్నడ భాషను నొక్కి చెబుతూ మాట్లాడగా, బుర్ఖా ధరించిన మరో మహిళ హిందీ, ఆంగ్ల భాషల్లో స్పందించింది. అరేయ్… చీఫ్ మినిస్టర్ కీ (మీరు ముఖ్యమంత్రి మహిళా?) అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది, చల్ నికల్ యాహసే (ఇక్కడి నుంచి వెళ్లు) అని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది.
Also Read: Jio recharge plans 2025: దసరాకి జియో అద్భుతమైన ఆఫర్.. ఒక్క రీచార్జ్ చేస్తే ఎన్నో అదనపు లాభాలు
కర్ణాటక కన్నడలోనే మాట్లాడు
ఎదురుగా ఉన్న మరో మహిళ ఇది కర్ణాటక కన్నడలోనే మాట్లాడు అంటూ గొంతు పెంచింది. దీంతో ఇద్దరి మధ్య వాదనలు మరింత చెలరేగింది. వారిద్దరి అరుపులకు, అక్కడున్న వారందరూ వారినే చూస్తూ ఉండి పోయారు. అంతేకాదు వారిద్దరూ గొడవతో ఆగలేదు, దాడి చేసేందుకు ఒకరినొకరు ముందుకు వెళ్లారు. దీంతో అక్కడున్న వారు జోక్యం చేసుకొని వారిని విడదీసినప్పటికీ, హిందీ, కన్నడ భాషలపై వాదోపవాదాలు కొనసాగాయి. చివరకు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వీడియో వైరల్
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, సమాజంలో భాషా వివాదాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ గొడవపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు రానురాను ఎక్కువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. భాష కంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా సంభాషణ జరిపితే సరిపోతుందని, భాషా వివాదాలతో ఇబ్బందులు సృష్టించుకోవడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు ఆలోచించాలి
ఈ ఘటన భాషా సమస్యలపై సమాజంలో ఉన్న సున్నితత్వాన్ని బహిర్గతం చేసింది. భాష ఒకరినొకరు కలిపే సాధనంగా ఉండాలి కానీ, విభజనకు కారణం కావడం దురదృష్టకరం. ఈ వివాదం స్థానికత, భాషా గుర్తింపు, సహనం వంటి అంశాలపై అధికారులు ఆలోచించాలని కామెంట్లు చేస్తున్నారు. భాష కాదు ఎదుటి వారికి అర్థమైన రీతిలో చెబితే చాలు కదా భాషతో సంబంధం ఏముందని మండిపడుతున్నారు.
ఇది వీడియో.. మీరు చూడండి..😱👇