Kavitha 2.0: తెలంగాణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాక్టివేట్ అయ్యారు. దసరా రోజు నుంచి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. రాజకీయ పార్టీ పెట్టేందుకు ఆమె రెడీ అయ్యారు. పార్టీ పేరేంటి? జెండా, అజెండా ఏంటనేది పక్కనబెడితే.. 15 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. అందులో అన్నివర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
దసరా రోజు కవిత కీలక నిర్ణయం
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీలోకి వెళ్తారో తెలీదు. ఎటువైపు ఉంటారో తెలీదు. గడిచిన దశాబ్దకాలంగా పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఒకప్పుడు పార్టీ నుంచి బలమైన వాయిస్ వినిపించే నేతలు ప్రస్తుత రోజుల్లో కరువయ్యారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయ్యింది. ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు.. కీలక నేతలు, కారకర్తలతో మంతనాలు చేస్తున్నారు. శనివారం నుంచి క్షేత్రస్థాయిలో దిగేందుకు సిద్ధమయ్యాయి. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
నూతన కమిటీ ఏర్పాటు
స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి కవిత మద్దతుదారులు దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సమయంలో ఆమె సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. విజయ దశమి రోజు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ALSO READ: పహల్గాం ఘటనపై ఓవైసీ షాకింగ్ కామెంట్స్
నెల రోజుల నుండి అన్నివర్గాల ప్రజలు, రాజకీయ పరిశీలకుల నుండి సూచనలు-సలహాలు-అభిప్రాయాలు స్వీకరించారు. 15 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేసిన ఆమె, అందులో అన్నివర్గాల వారికి సముచిత స్థానం కల్పించారు. నూతన కమిటీలో అధ్యక్షుని పేరు ఎంపిక చేయనున్నారు. పార్టీ అధ్యక్షుని మార్పు, వ్యవహరించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
అధ్యక్షుని మార్పుతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా ఎదగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కవిత పార్టీలో చేరడానికి అన్నిపార్టీల నుండి నేతలు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కవిత పట్టుబిగిస్తే బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు.
మరోవైపు కవిత వైపు నుంచి జరిగిన.. జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ కీలక నేతలు గమనిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత మద్దతుదారులు బరిలోకి దిగితే కొన్ని ప్రాంతాల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని చర్చించుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.
పండగ పూట జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక నిర్ణయం
తెలంగాణ జాగృతి అధ్యక్షునిగా కొత్తవారికి అవకాశం
18 ఏళ్లుగా జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత
15 మందితో నూతన కమిటీ ఏర్పాటు
ఇవాళ కొత్త కమిటీ అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం pic.twitter.com/zlSKXsItUW
— BIG TV Breaking News (@bigtvtelugu) October 2, 2025
You are on desktop!