BigTV English

Do’s & Don’ts in Ashada Masam : ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులేమిటి? చేయకూడనవి ఏంటి?

Do’s & Don’ts in Ashada Masam : ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులేమిటి? చేయకూడనవి ఏంటి?


Do’s & Don’ts in Ashada Masam : తెలుగు మాసాలలో మిగిలిన వాటితో పోల్చితే ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. శుభకార్యాలు చేయకూడదు.. అత్తాకోడలు, కలిసి ఉండకూడదని, కొత్తగా పెళ్లైన జంటలు కలిసి ఉండకూడదని..ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి. ఆషాఢ ఆదివారాలు మునగాకు తినాలని, అవిస పువ్వు తీసుకోవాలన్న నియమం కూడా ఉంది. వాస్తవానికి ఆషాఢ మాసం పవిత్రమైనది కాదని భావిస్తుంటారు. పూజలు, శుభ కార్యాల కోసం శ్రావణమాసం వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ పూజలకు ఆది.. ఆషాఢమే అంటారు. తొలి ఏకాదశి వచ్చే మాసం కూడా ఇదే. ఈ నెలలోనే దక్షిణాయానం మొదలవుతుంది.

తెలంగాణలో ఆషాఢమాసంలోనే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆషాఢ గురువారాల్లో రాయలసీమ ప్రాంతంలో బోనాలు చేస్తారు. కానీ అక్కడ బోనం అని పిలవరు. అమ్మవారికి ఆహారం సమర్పించడమే బోనం. ఆరోగ్య సమస్యలు వచ్చే సమయం కూడా ఆషాఢమాసమే. తొలకరి జల్లులు, అకస్మాత్తుగా వాతావరణంతో అంటురోగాలు, చర్మవ్యాధులు ప్రబలుతుంటాయి. అందుకే ఆ ఊరి గ్రామదేవతను పూజించాలి. ఈ సీజన్ లోనే వేపను ఎక్కువగా వాడాలి. వేపు కొమ్మల్ని గుమ్మాలకి కట్టుకోవాలి. ఆషాఢమాసంలో ఉపవాసం చేస్తే ఒంటికి మంచిది. ఈ నాలుగు మాసాల్లోను ప్రయాణాలు చేయకూడని శాస్త్రం చెబుతోంది. ఒక నెల రోజుల పాటు ఆకుకూరలు తినడం మానేయాలి. నెలకో రకం పప్పులు తినేయడం మానేయాలి. వచ్చే 4 నెలల్లో 9 ఏకాదశులు ఉంటాయి. అలా చాతుర్మాస్యాన్ని ఆచరిస్తే మంచిది.


పూర్తి ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేయాలి. ఈ మాసంలో దానాలు విరివిగా చేయడం, తర్పణాలు వదలడం చేయాలి. దక్షిణాయనంలో ఉపనయనాలు చేయకూడదని, పెళ్లిళ్లు మాత్రం చేసుకోవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి. దేవతలు నిద్రావస్థలో ఉండే సమయం కాబట్టి యజ్ఞాలులాంటివి చేయరంటారు. ఆషాఢ గురువారాల్లో అమ్మవారికి చేసే అర్చనలు విశేషమైన ఫలితాలను ఇస్తాయంటారు.

Related News

Ganesh Chaturthi: గణపతి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారు? గణేష్ లడ్డూ విశిష్టత ఏమిటి..

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

Tirumala Darshan: వరుస సెలవులు.. భక్తులతో సందడిగా మారిన తిరుమల

Shri Krishna Janmashtami: దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. కిటకిటలాడుతున్న దేవాలయాలు..

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

Hinduism – Science: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

Big Stories

×