EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ధనమే ధనం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ధనమే ధనం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందనే విషయాలపై జ్యోతిష్యులు ఎలాంటి విషయాలు చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించినమేర లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం:
వృషభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. భూసంబంధిత వివాదాల పరిష్కారం. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి వారి నుండి పిలుపు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. విష్ణుధ్యానం చేయండి.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి, లాభాలు అత్యంత స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం:
కర్కాటక రాశి వారి శుభప్రాదాయకంగా ఉంటుంది. అందరిలోనూ గుర్తింపుతో పాటు మన్ననలు అందుకుంటారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాలలోనూ పాలుపంచుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కవచ్చు. అంగారకస్తోత్రం పఠించండి.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం మీ అంచనాల మేరకు లభిస్తుంది. వస్తులాభాలు.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు ఉన్నత పదవులు. గణేశాష్టకం పఠించండి.

కన్య:
ఈ రాశి వారికి  మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులు బాధ్యతలను అంకితభావంతో పూర్తి చేస్తారు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

తుల:
తుల రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆదాయం ఖర్చులకు సరిపడా లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు ప్రస్తుతం వాయిదా వేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు.  వ్యాపారాలలో లాభాలు తథ్యం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదనపు రాబడితో హుషారుగా గడుపుతారు. ఇంటాబయటా సంతోషదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగి లాభాల బాట పడతారు. ఉద్యోగులకు ఒక ముఖ్య సందేశం ఊరటనిస్తుంది. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. సంఘంలో గౌరవమర్యాదలకు లోటురాదు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధన ప్రవాహమే. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మరుగున పడిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారమై ఉత్సాహంగా గడుపుతారు. పసుపు, గులాబీ రంగులు, వినాయకుని పూజించండి.

కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడి కొంత నిల్వ చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో రెండడుగులు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి విముక్తి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మీనం:
మీనం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన రీతిలో నిర్ణయాలు ఉంటాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. కనకధారా స్తోత్రం పఠించండి.

Related News

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

Big Stories

×