KTR Latest Comments On Telangana Government Over Sunkishala Incident: సుంకిశాల ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫైరయ్యారు. సుంకిశాల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని కాంగ్రెస్ నేతలు కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. సుంకిశాల ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా(ఎక్స్)లో కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. రూ. కోట్ల నష్టం జరిగినా కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Also Read: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్‌లను ప్రారంభించనున్న సీఎం రేవంత్
రూ. 75 కోట్లకు పైగా నష్టం జరిగినప్పటికీ కనీసం మాట్లాడడం లేదని ఆయన అన్నారు. సుంకిశాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఆ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.