Janhvi Kapoor: జాన్వీ కపూర్ (Janhvi Kapoor)పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ దివంగత నటి శ్రీదేవి(Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీకి ధడక్ సినిమా ద్వారా ఈమె పరిచయమయ్యారు. ఇదివరకు జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో ఈమె సౌత్ సినిమాలపై కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే జాన్వీ నటించిన పరం సుందరి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పలు ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
ఆ రెండు సినిమాలు అంత ఇష్టమా…
శ్రీదేవి ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు. శ్రీదేవి గారు నటించిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏవి అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానం చెబుతూ.. అమ్మ నటించిన సినిమాలలో తనకు మిస్టర్ ఇండియా(Mr.India) అనే బాలీవుడ్ సినిమా అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadekaveerudu Athiloka Sundari) సినిమా అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. ఈ రెండు సినిమాలు తన ఫేవరెట్ సినిమాలంటూ జాన్వి కపూర్ వెల్లడించడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
జగదేకవీరుడు అతిలోకసుందరి..
ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో తనకు అందాలలో అంటూ సాగిపోయే పాటతో పాటు అబ్బనీ తీయని దెబ్బ అని పాట కూడా చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా తన తల్లి నటించిన తెలుగు సినిమా అంటే తనకి ఇష్టం అనే విషయాన్ని తెలియచేయడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె సౌత్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర (Devara)సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది(Peddi) సినిమాలో నటిస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంలో పెద్ది…
ఇలా తన మొదటి రెండు సినిమాలు కూడా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం. పెద్ది సినిమా విషయానికి వస్తే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఇది కాస్త ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ వీడియో మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ షూటింగ్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఇక తదుపరి షెడ్యూల్ మైసూర్ లో జరగబోతుందని తెలుస్తుంది.
Also Read: The Raja Saab: ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అప్పుడే..కానీ వర్కౌట్ అయ్యేనా?