BigTV English

Virender Sehwag son : సెహ్వాగ్ కుమారుడి బ్యాటింగ్ చూశారా.. తండ్రిని మించిపోయి ఆడుతున్నాడుగా.. ఇదిగో వీడియో

Virender Sehwag son : సెహ్వాగ్ కుమారుడి బ్యాటింగ్ చూశారా.. తండ్రిని మించిపోయి  ఆడుతున్నాడుగా.. ఇదిగో వీడియో

Virender Sehwag son : టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సెహ్వాగ్ క్రీజులో ఉంటే.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు వణుకుపుడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ బౌలర్లకు అయితే చుక్కలు చూపించాడు. అలాగే 2002లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో సెహ్వాగ్ క్రీజులో ఉన్నంత సేపు ఆస్ట్రేలియా బౌలర్లు భయబ్రాంతులకు గురయ్యారు. అంతలా బ్యాటింగ్ చేశాడు. సచిన్ తో పాటు సెహ్వాగ్ కూడా డబుల్ సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. సెహ్వాగ్ గురించి ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే.. సెహ్వాగ్ మళ్లీ ఓపెనర్ గా వచ్చేశాడు. ఏంటి..? నమ్మలేకపోతున్నారా..? ఈసారి వచ్చింది వీరేంద్ర సెహ్వాగ్ కాదండోయ్.. ఆర్యవీర్ సెహ్వాగ్.


Also Read : Mohammed Shami : నేను రిటైర్మెంట్ ఇవ్వను.. ఆసియా కప్ 2025 లో ఆడి తీరుతా.. బీసీసీఐకి షమీ వార్నింగ్

తండ్రికి తగ్గ తనయుడు.. 


ఇంతకు ఈ ఆర్యవీర్ సెహ్వాగ్ ఎవరంటే..? వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడే ఆర్యవీర్ సెహ్వాగ్. ఆర్యవీర్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఆరంగేట్రం చేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ పై తన తొలి టీ-20 మ్యాచ్ ఆడాడు ఆర్యవీర్. ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన ఆర్యవీర్ సెహ్వాగ్ అచ్చం తండ్రి మాదిరిగానే ఆడాడు. అయితే తండ్రి సెహ్వాగ్ ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. ఇతను మాత్రం ఫోర్ కొట్టి ఖాతా తెరవకపోయినా.. తన తండ్రి మాదిరిగానే దూకుడుగా కనిపించాడు. 18 సంవత్సరాల ఆర్యవీర్ ఫాస్ట్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. కొత్త బంతితో భారత పేసర్ నవదీప్ సైనీని ఎదుర్కొని.. వరుసగా సైనీ బౌలింగ్ లో రెండు బౌండరీలు బాదాడు ఆర్యవీర్. తొలి బౌండరీని ఆఫ్ సైడ్ కొట్టగా.. రెండో బౌండరీని లాప్టెడ్ డ్రైవ్ తో రాబట్టాడు. అతని డేరింగ్ బ్యాటింగ్ ని చూసి అంతా తండ్రి సెహ్వాగ్ ని మించిపోతాడని కామెంట్స్ చేస్తున్నారు.

 ట్రిపుల్ సెంచరీ మిస్.. 

ఆర్యవీర్ కొద్ది సేపే క్రీజులో ఉన్నప్పటికీ తన అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించాడు. కేవలం 16 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్.. 4 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆర్యవీర్ ఇటీవలే ఇన్ సైడ్ స్పోర్ట్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరోవైపు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాతినిధ్యం వహించాలని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకోవాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు ఆర్యవీర్. ఆర్యవీర్ అచ్చం తండ్రి సెహ్వాగ్ అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గత ఏడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్ -19 జట్టు తరపున తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ వర్సెస్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 62 పరుగుల తేడాతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ విజయం సాధించింది.

Related News

Mohammed Shami : నేను రిటైర్మెంట్ ఇవ్వను.. ఆసియా కప్ 2025 లో ఆడి తీరుతా.. బీసీసీఐకి షమీ వార్నింగ్

Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్

Virat Kohli : AB డివిలియర్స్ తల్లిని పచ్చి బూతులు తిట్టిన కోహ్లీ… ఇదిగో షాకింగ్ వీడియో

RCB Jersey : కోహ్లీ పరువు పాయే… కుక్కకు RCB జెర్సీ వేసి దారుణం

Rizwan : పాక్ క్రికెటర్ ను పొట్టు పొట్టుగా కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్‌వాల్

Big Stories

×