BigTV English

Jatadhara: జటాధర.. భయపెడుతున్న మహేష్ మరదలి లుక్

Jatadhara: జటాధర.. భయపెడుతున్న మహేష్ మరదలి లుక్

Jatadhara: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న  కొత్త చిత్రం జటాధర. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో, ఉమేష్ కుమార్ బన్సాల్ మరియు ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్  నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్ మరియు కుసుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక తాజాగా జటాధర నుంచి శిల్ప శిరోద్కర్ లుక్ ను రిలీజ్ చేశారు. శోభ అనే పాత్రలో శిల్ప నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక పోస్టర్ లో శిల్ప నల్లచీర కట్టుకొని హోమం ముందు కూర్చొని నాలుక బయటపెట్టి భయంకరంగా కనిపిస్తుంది. ఈ పోస్టర్ ను బట్టి.. శిల్ప నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక శిల్ప లుక్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.

సుధీర్ బాబు ఎప్పటినుంచో ఒక భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. మంచి కథలతో వస్తున్నా ఎందుకో ప్రేక్షకులు అతని సినిమాలను ఆదరించలేకపోతున్నారు. అయినా నిరాశపడకుండా కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. జటాధర కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఈ సినిమాతో సోనాక్షి తెలుగుతెరకు పరిచయం అవుతుంది. ఇప్పటికే టీజర్ లో ఆమె లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ ను రంగంలోకి దించారు.


శిల్పా శిరోద్కర్.. మహేష్ భార్య నమ్రత చెల్లి అన్న విషయం అందరికీ తెల్సిందే. హిందీ బిగ్ బాస్ ద్వారా శిల్ప మరింత  గుర్తింపును తెచ్చుకుంది. బిగ్ బాస్ తరువాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు శిల్పా కొద్దిగా బరువు తగ్గి మరింత అందంగా కనిపిస్తుంది.  ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా సుధీర్ బాబు విజయాన్ని అందుకుంటాడేమోచూడాలి.

Related News

Akhanda 2: ఇట్స్ అఫీసియల్… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య… ఇక ఓజీ ఒంటరిగానే

S.V.Krishna Reddy: వేదవ్యాస్ గా రాబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోయిన్ గా కొరియన్ నటి

Dil Raju : రాజుగారిని ఆదుకోవాలంటే… ప్రతి సారి పవనేశ్వరుడే రావాలా ?

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Om Raut: ఇదేం కర్మ రా బాబు, సినిమా వచ్చి వెళ్లిపోయిన ఈ దర్శకుడికి తిట్లు మాత్రం తప్పట్లేదు

Kingdom OTT: ఇక్కడ కూడా అభిమానులకు నిరాశే..

Big Stories

×