BigTV English

Knot Dating: డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలే ఎక్కువట.. ఏకంగా రూ.57 వేలు చెల్లించి మరి..

Knot Dating: డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలే ఎక్కువట.. ఏకంగా రూ.57 వేలు చెల్లించి మరి..

Knot Dating App: ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. తమకు ఇష్టమైన వారిని యువతీ యువకులు డేటింగ్ యాప్స్ ద్వారానే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ముందుగా యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం.. ఆ తర్వాత కొత్త వారితో పరిచయం పెంచుకుంటారు. ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేస్తారు. ఒకరికొకరు నచ్చితే డేటింగ్ చేస్తారు. ఇంకా నచ్చితే లివింగ్ రిలేషన్ లోకి వెళ్తారు. అప్పటికీ కలిసే ఉండాలని భావిస్తే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అవుతారు. అచ్చంగా ఇలాంటి అవకాశమే కల్పిస్తుంది ఇండియాలో బాగా పాపులర్ అయిన నాట్ డేటింగ్ యాప్. ఇందులో సబ్‌ స్క్రిప్షన్‌ ఫీజ్ ఎక్కువే అయినా, చాలా మంది ఇందులో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, ఈ యాప్ లో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట.


6 నెలలకు రూ. 57 వేల సబ్‌ స్క్రిప్షన్‌ ఛార్జీ

ఇక నాట్ డేటింగ్ యాప్ లో 6 నెలలకు రూ. 57,459 సబ్‌ స్క్రిప్షన్‌ ఛార్జీ వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ యాప్ కు రోజు రోజుకు వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. తమ యాప్ విశ్వసనీయతకు మారుపేరుగా నిలువడం వల్లే ఎక్కువ మంది సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకుంటున్నారని CEO జస్వీర్ సింగ్ వెల్లడించారు. అంతేకాదు, తమ యాప్ లో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నట్లు వివరించారు. 57 శాతం అమ్మాయిలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ యాప్ ప్రైవసీ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఫుష్ నోటిషికేషన్లు, కాల్స్ లాంటివి ఏవీ ఉండవన్నారు.


నచ్చిన జోడీని వెతికి పెడుతుంది

దేశంలో డేటింగ్, మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ ఫామ్‌ లలో ఎక్కువగా పురుషులు మాత్రమే డబ్బులు చెల్లిస్తారని భావిస్తారని, అందులో నిజం లేదన్నారు సింగ్. తమ యాప్ కు మహిళల నుంచి ఎక్కువ ఆదరణ ఉన్నట్లు వివరించారు. దానికి కారణం గోప్యత ఎక్కువగా పాటించడమేనని చెప్పారు. Knot.dating AI-ఆధారిత మ్యాచ్‌ మేకింగ్ ప్లాట్‌ ఫామ్‌ గా మారుతుందన్నారు. ఈ యాప్ వినియోగదారులతో సంభాషిస్తుందన్నారు. వారి ప్రాధాన్యతల గురించి తెలుసుకుని,  వారికి సరైన భాగస్వామిని కనుగొనడంలో సహాయపడుతుందన్నారు. ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే మ్యాట్రిమోనియల్ సేవలను అందిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ లో సాధారణంగా 27 నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, వారు సాధారణ డేటింగ్‌కు బదులుగా పెళ్లి చేసుకునేందుకు తగిన విధంగా రెడీ అవుతున్నట్లు వివరించారు.  ఈ ప్లాట్‌ ఫామ్ ప్రైవసీతో పాటు ప్రామాణికతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.  అనుభవజ్ఞులైన మ్యాచ్‌ మేకర్ల ద్వారా 100% ధృవీకరించబడిన ప్రొఫైల్స్, క్యూరేటెడ్ మ్యాచ్‌ లను అందిస్తున్నట్లు వివరించింది. సాంప్రదాయ మ్యాట్రిమోనీ యాప్‌ ల మాదిరిగా కాకుండా ప్రైవేట్, సెలెక్టివ్ కమ్యూనిటీని నిర్వహిస్తుందన్నారు. ఇప్పటికే ఉన్న వినియోగదారుల నుంచి రిఫరల్స్ ద్వారా, కంపెనీ వెబ్‌ సైట్‌ లో సమర్పించిన దరఖాస్తుల ద్వారా మెంబర్ షిప్ ఇస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఎప్పటికప్పుడు ప్రొపైల్స్ సమీక్షిస్తున్నట్లు వివరించారు.

ఏడాదికి రూ. 50 లక్షలు సంపాదిస్తేనే..

Knot.dating తన ప్లాట్‌ ఫామ్‌ లో మెంబర్ షిప్ తీసుకోవాలనుకునే పురుషులకు సంస్థ ఓ కండీషన్ పెట్టింది. ఏడాదికి కనీసం రూ. 50 లక్షలు సంపాదించాలనే రూల్ తీసుకొచ్చింది.

Read Also: హైదరాబాద్ కు బీచ్ వచ్చేసింది, ఇక ఎంజాయే ఎంజాయ్!

Related News

Mobile Phones: మొబైల్‌తో ఇలా చేస్తున్నారా? మీరు రిస్క్‌లో ఉన్నట్లే!

Skin Allergy: స్కిన్ అలెర్జీకి కారణాలివేనట !

Weight loss: ఈజీగా బరువు తగ్గాలా ? అయితే ఈ టిప్స్ మీకోసమే !

Migraine: మైగ్రేన్ తగ్గడం లేదా ? ఈ టిప్స్ పాటిస్తే.. సరి !

Drumstick Leaves: వీళ్లు.. పొరపాటున కూడా మునగాకు తినొద్దు !

Big Stories

×